Pawan kalyan : పవన్ కళ్యాణ్ బర్త్ డే.. జనసేన వినూత్నం, ఐదు సేవా కార్యక్రమాలకు పిలుపు

  • IndiaGlitz, [Tuesday,August 29 2023]

జనసేన అధినేత , సినీనటుడు పవన్ కల్యాణ్ పుట్టినరోజంటే అభిమానులకు పండుగ రోజు. పవన్ అన్న పేరే ప్రభంజనం, పవన్ వెంటే మహాజనం, పవన్ అంటే అభిమానులకు ప్రాణం. మరి అంతటి స్టార్‌డమ్ కలిగిన వ్యక్తి బర్త్ డే వేడుకలు సాధారణంగా జరుగుతాయా. ఆ రోజున వూరు వాడా రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ఈసారి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవార జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పీఏసీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లాలు, నగర అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, నగర అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పవన్ జన్మదినోత్సవం ఒకే రోజు .. ఒకే సమయంలో నిర్వహిస్తామని చెప్పారు.

సెప్టెంబర్ 2న మంగళగిరి జనసేన కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం:

సెప్టెంబర్ 2వ తేదీ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగే మెగా రక్తదాన శిబిరంలో తాను స్వయంగా పాల్గొంటానని మనోహర్ చెప్పారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా ఐదు అంశాలతో కూడిన సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి జనసైనికుడు, వీర మహిళ పాలు పంచుకోవాలన్నారు. పవన్ రాజకీయ ప్రయాణంలో గుర్తించిన అంశాల ఆధారంగా ఈ కార్యక్రమాలను రూపొందించామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. భవన నిర్మాణ కార్మికులతో సహపంక్తి భోజనాలు, రెల్లి కాలనీల సందర్శన, రెల్లి సోదరులకు నూతన వస్త్రాలు, భోజన ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల నిర్వహణ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు సందర్శించి విద్యార్ధులకు పుస్తకాలు, స్టేషనరీ అందించడం, దివ్యాంగులకు సాయం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

కార్యక్రమం వీడియోలు, ఫోటోలతో క్యాంపెయిన్ :

ఈ ఐదు కార్యక్రమాలు పవన్‌కు ఎంతో ఇష్టమైనవన్నారు. బైకు ర్యాలీలు, కేక్ కటింగ్‌లకు సమయం వృథా చేయొద్దని నాదెండ్ల సూచించారు. ఈ ఐదు అంశాల్లో ఏ కార్యక్రమం చేపట్టినా పవన్ సంతోషిస్తారని , ఈ కార్యక్రమాలు పది మందికి తెలిసేలా ముందుకు తీసుకెళ్లాలని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు . ఈ కార్యక్రమాల వివరాలను వీడియోలు, ఫోటోలు రూపంలో కేంద్ర కార్యాలయానికి పంపాలని.. అలాగే ఓ స్పెషల్ హ్యాష్‌ట్యాగ్ ద్వారా డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిద్దామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

More News

Family Dhamaka:ఫ్యామిలీ ధమాకా.. ఇది దాస్ కా ఇలాఖా : విశ్వక్‌సేన్ హోస్ట్‌‌గా ఆహాలో రియాలిటీ షో, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. సీనియర్ హీరో హీరోయిన్లు , నటుడు, ప్రతిభావంతులకు ఈ పరిశ్రమ అవకాశాలు కల్పిస్తోంది.

Phone ban: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం .. స్కూళ్లలో మొబైల్ ఫోన్లపై నిషేధం

సమాచార మార్పిడి కోసం అందుబాటులోకి వచ్చిన సెల్‌ఫోన్ ప్రస్తుతం మనిషి నిత్య జీవితంలో భాగమైన సంగతి తెలిసిందే.

NTR100 Rupees Coin:రూ.100 ఎన్టీఆర్ నాణెం విడుదల .. ఢిల్లీ ఘనంగా కార్యక్రమం, హాజరైన అన్నగారి కుటుంబం

టీడీపీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా

Congress:చేవేళ్లలో ప్రజా గర్జన : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన టీ.కాంగ్రెస్.. ముఖ్యాంశాలివే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిళాలు ప్రకటిస్తోంది.

Kangana Ranaut:నా కెరీర్‌లో 'చంద్రముఖి 2' వంటి గొప్ప సినిమా చేయలేదు - కంగనా రనౌత్

స్టార్ కొరియోగ్రాఫ‌ర్‌, డైరెక్ట‌ర్‌, యాక్ట‌ర్  రాఘవ లారెన్స్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’.