Nagababu: గ్రామస్థాయిలో బలంగా జనసేన.. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా రెడీ : నాగబాబు
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో బలంగా ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బలంగా బరిలోకి దిగేందుకు జనసైనికులు సిద్దంగా ఉన్నారని అన్నారు ఆ పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు, సినీనటుడు కొణిదెల నాగబాబు . ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధులతో నాగబాబు మాట్లాడారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీకి బలమైన పునాదులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా నేతలతో నాగబాబు భేటీ:
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాత పట్నం, నర్సన్న పేట, ఆముదాలవలస, శ్రీకాకుళం, రాజాం, పాలకొండ, ఎడ్చెర్ల నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా, వార్డ్ మెంబర్లుగా పోటీ చేసి గెలుపొందిన ప్రజా ప్రతినిధులు, పోటీలో నిలిచిన వారితో మాట్లాడానని నాగబాబు పేర్కొన్నారు. జన సైనికులలో ఎక్కువ శాతం మేధావులు, విద్యావంతులు, ఐ.టీ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
కార్యకర్తలకే తొలి ప్రాధాన్యత:
వారందరి ఆలోచన విధానం, మేధస్సు, పార్టీ గెలుపు కోసం వారు చేస్తున్న కృషి అమూల్యమైనది అని నాగబాబు ప్రశంసించారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే జనసేన పార్టీ ప్రధాన విధానమని ఆయన స్పష్టం చేశారు. ఆ కోవలోనే జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీల్లో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తున్నామని నాగబాబు పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జనసైనికులు పని చేస్తున్నారు ఆయన కితాబిచ్చారు.
మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో నాగబాబు పర్యటన:
కాగా.. జూన్ 1 నుంచి నాగబాబు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జనసేన పార్టీ ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న శ్రీకాకుళం జిల్లా, జూన్ 2న విజయనగరం జిల్లా, జూన్ 3న విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జనసేన పార్టీ ముఖ్య నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ నాయకులు, ఆయా విభాగాల కమిటీ నాయకులతో నాగబాబు సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలోచనా విధానం, పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేస్తారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments