Janasena : సీక్రెట్‌గా ఆ డీల్, రామాయపట్నంపై ఎన్నో అనుమానాలు.. జగన్ సమాధానం చెప్పాల్సిందే: నాదెండ్ల
Send us your feedback to audioarticles@vaarta.com
కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో ఉన్న ఎమ్.ఓ.యు.ని ముఖ్యమంత్రి ఎందుకు గోప్యంగా ఉంచారని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ఈ ప్లాంట్ కి రామాయపట్నం పోర్టులో ప్రత్యేకంగా ఒక బెర్తు కేటాయించేలా ఆ అవగాహన ఒప్పందంలో ఉందని.. దీనిని 2020లో కుదుర్చుకున్నారని ఆయన వెల్లడించారు. ఆ అవగాహన ఒప్పందం ప్రకారం రామాయపట్నం పోర్టులో నిర్మించిన నాలుగు బెర్తుల ద్వారా 25 మిలియన్ టన్నుల ఎగుమతి సామర్థ్యం ఉంటుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ నాలుగింటిలో ఒక బెర్తునే కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు కేటాయిస్తారని తెలిపారు. ఈ అవగాహన ఒప్పందానికి నాలుగేళ్ల కాలపరిమితి ఉందని... 2020లో చేసుకున్న ఈ అవగాహన ఒప్పందం మరో రెండేళ్లలో ముగుస్తున్నా ఇప్పటికీ ఈ రెండు ప్రాజెక్టులు మొదలు కాలేదని నాదెండ్ల మనోహర్ చురకలు వేశారు.
ఆ రూ.1000 కోట్లు ఏమయ్యాయి:
రెండుసార్లు శంకుస్థాపన చేసిన రామాయపట్నం పోర్టుకు ఇప్పటి వరకు- ప్రాజెక్టుకు అవసరమైన నిధుల లభ్యత ఒప్పంద చర్చే ఒక కొలిక్కి రాలేన్నారు. ఇందుకు సంబంధించిన ఫైనాన్షియల్ క్లోజర్ లేకుండా ప్రాజెక్టు ఎలా మొదలుపెడతారని ఆయన ప్రశ్నించారు. ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ హడావిడి చేశారు.. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా విక్రయించినప్పుడు వచ్చిన రూ.వెయ్యి కోట్లు ఎటుపోయాయని నాదెండ్ల నిలదీశారు. కడప స్టీల్ ప్లాంట్, ఏపీ మారిటైమ్ బోర్డు మధ్య జరిగిన అవగాహన ఒప్పందం గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ కాదట హోమ్ టూ వర్క్ అంట:
విభజన చట్టం హామీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తాము నిర్మిస్తామని చెబుతున్నా... రామాయపట్నం పోర్టును ఎందుకు నాన్ మేజర్ పోర్టుగా నోటిఫై చేశారని మనోహర్ నిలదీశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఆయన కొత్తగా హోమ్ టూ వర్క్ అని చెప్పారని... స్థానికులకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పారని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వం వచ్చాక స్థానిక యువతకు ఏయే పరిశ్రమలో ఎందరికి ఉద్యోగాలిప్పించారో చెప్పగలరా అని నాదెండ్ల మనోహర్ చురకలు వేశారు. ఎన్నికలకు ముందు రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారని చెబుతున్న ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ క్లోజర్ లేకుండా శంకుస్థాపన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం వెనక ఇన్ని సందేహాలు ఉన్నాయని.. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పి, అనుమానాలు తీర్చాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com