వట్టిచెరుకూరు ట్రాక్టర్ ప్రమాదం.. గుంటూరు జీజీహెచ్‌లో క్షతగాత్రులను పరామర్శించిన నాదెండ్ల మనోహర్

  • IndiaGlitz, [Tuesday,June 06 2023]

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ట్రాక్టర్ బోల్తా పడి ఏడుగురు మరణించిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని నాదెండ్ల డాక్టర్లను కోరారు.

శుభకార్యానికి వెళ్తుండగా విషాదం :

కాగా.. కొండేపాడు నుంచి జూపూడికి ఓ శుభకార్యం నిమిత్తం 40 మంది ట్రాక్టర్‌లో బయల్దేరారు. అయితే ఇది వట్టి చెరుకూరు సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 20 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు రూ. లక్ష ఆర్ధిక సాయం, స్వల్పగాయాలైన వారికి వైద్య చికిత్స రూ.25 వేల సాయం అందించాలని జగన్ అధికారులను ఆదేశించారు.

ప్రమాదంపై పవన్ దిగ్భ్రాంతి :

అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం దురదృష్టకరమని, ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు ప్రాణాలు కోల్పవోడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను కోరారు.

More News

జనసేన ఆస్ట్రేలియా సహ సమన్వయకర్తలు వీరే .. నాగబాబు కీలక ప్రకటన

పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో బలమైన కేడర్ వున్న సంగతి తెలిసిందే. అలాగే వివిధ దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు సైతం పవన్ భావజలాన్ని, ప్రణాళికలను

Janasena: అనుకోని ప్రమాదాలు.. రోడ్డునపడ్డ జనసైనికుల కుటుంబాలు: నేనున్నానంటూ పవన్, బీమా అందజేసిన నాదెండ్ల

ప్రజలకు ఏదో ఒకటి చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కల్యాణ్. 2014లో పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన తన కష్టాన్నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నారు.

శ్రీకాంత్ కూతురిని చూశారా.. ఆ అందం ముందు హీరోయిన్లు కూడా దిగదుడుపే

టాలీవుడ్‌లో వున్న విలక్షణ నటుల్లో శ్రీకాంత్ ఒకరు. విలన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించారు. లవ్, రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, జానపదం, పౌరాణికం,

Shaitan Trailer: 'సైతాన్' ట్రైలర్ : వామ్మో.. నెక్ట్స్ లెవల్‌లో క్రైమ్ సీన్లు, బూతులు, బోల్డ్ కంటెంట్

డిఫరెంట్ జోనర్‌లో సినిమాలు చేస్తూ అభిరుచి వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మహి వీ రాఘవ. ఆనందో బ్రహ్మా వంటి కామెడీ చిత్రంతో తన టాలెంట్ నిరూపించుకున్న ఆయన తర్వాత ఎవరు

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుక మరియు మెమోరియల్‌ అవార్డ్స్‌

ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు,