Janasena : సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్.. కొందరిపై ఎందుకీ వివక్ష : నాదెండ్ల మనోహర్
Send us your feedback to audioarticles@vaarta.com
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటనలో రాష్ట్రప్రభుత్వం కొంతమంది ఉద్యోగుల పట్ల వివక్ష వైఖరి కనబరుస్తోందని ఆరోపించారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఈ మేరకు ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. దాదాపు 45 వేల మంది సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ ఇవ్వకుండా పక్కనపెట్టే ప్రయత్నాలు మొదలుకావడంతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన మొదలైందన్నారు. ఉద్యోగ జీవితంలో మొదటి అడుగులు వేస్తున్నవారిని ఈ విధంగా మానసిక ఇబ్బందులకు గురి చేయడం భావ్యం కాదని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రెండేళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్న అందరికీ ప్రొబేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓటీఎస్‌కు ప్రొబేషన్‌కు లింకు:
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వెంటనే ప్రొబేషన్ ప్రకటిస్తామని వారి నియామక సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన సంగతిని నాదెండ్ల గుర్తుచేశారు. ప్రొబేషన్ ఇవ్వాలనే న్యాయమైన తమ డిమాండును నెరవేర్చాలని కోరుతున్నామన్నారు. గాంధేయ ధోరణిలో నిరసన తెలిపినవారిని ప్రొబేషన్ కు దూరంపెడుతున్న మాట నిజం కాదా? పేదల ఇళ్లకు సంబంధించిన వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)కీ ప్రొబేషన్ కు లింకుపెట్టి మరికొందరిని దూరంపెట్టడం నిజం కాదా? అని నాదెండ్ల ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేస్తూ రెండేళ్లు పూర్తి చేసుకున్నవారందరికీ ప్రొబేషన్ ప్రకటించాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై ఇప్పటికే జీవో విడుదల:
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు ఏపీ ప్రభుత్వం గత నెలలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జీవోను సైతం విడుదల చేసింది. రెండేళ్లు పూర్తి చేసుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారందరి ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. అలాగే సచివాలయ ఉద్యోగుల పే స్కేల్‌ను సైతం ఖరారు చేసింది. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీలకు బేసిక్ పే రూ.23,120 నుంచి రూ.74,770... ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ.22,460 నుంచి రూ.72,810గా ఖరారు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com