జనసేన కార్యకర్తల కోసం హైదరాబాద్, ఉత్తరాంధ్రలో నోటిఫికేషన్...
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తన పార్టీని పటిష్టం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా జనసేన సైనికుల కోసం పరీక్షలను నిర్వహించి మరీ సెలక్ట్ చేసుకుంటున్నాడు. విశాఖ, ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నాడు. తాము చేపట్టబోయే పరీక్షను పోటీ పరీక్షలా భావించవద్దని, అభ్యర్థి ప్రతిభను, శక్తియుక్తులను గుర్తించేందుకు మాత్రమేనని పవన్ తెలిపారు.
నవతరం, యువత, మేధావులకు చోటు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. అందుకు సంబంధించిన ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ మే 13వ తేదీలోపు దరఖాస్తులను పంపవచ్చునని లేఖలో పెర్కొన్నారు. రీసెంట్‌గా అనంతపురం జిల్లాలో జనసేన సైనిలకు ఎంపిక అర్హత పరీక్ష జరిగింది. అయితే ఆ ఫలితాలేవీ వెలువడలేదు. 2019లో జరిగే ఎన్నికల కోసం పవన్ ఓ ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తున్నారు. ఎన్నికల కంటే ముందుగానే సినిమాల పరంగా తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసేస్తున్నాడు. ప్రస్తుతం పవన్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments