close
Choose your channels

హాట్ టాపిక్‌గా జనసేన ఎమ్మెల్యే రాపాక..

Thursday, July 23, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హాట్ టాపిక్‌గా జనసేన ఎమ్మెల్యే రాపాక..

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు తన పార్టీ అధ్యక్షుడి కంటే వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌నే ఎక్కువ సార్లు ప్రశంసించి ఉంటారు. ఈ కారణంగానే ఆయన ఎక్కువగా హాట్ టాపిక్‌గా నిలిచారు. అయితే జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు నచ్చాయని.. అందుకే అభినందిస్తున్నానని రాపాక తన తీరును సమర్థించుకున్నారు కూడా. తాజాగా ఆయన చేసిన ఒక పనితో మరోసారి హాట్ టాపిక్‌గా రాపాక మారారు. తాజాగా జగన్ కేబినెట్‌లో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను రాపాక స్వయంగా కలిసి పుష్ప గుచ్ఛాలు అందించి అభినందించారు. అలాగే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ పొందిన ధర్మాన కృష్ణదాస్‌ను సైతం అభినందించారు. దీంతో మరోసారి రాపాక చర్చనీయాంశంగా మారారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment