జనసేనకు 150 సీట్లు రావొచ్చేమో.. ఎందుకు రాకూడదు!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తప్పకుండా గెలుస్తుందని మెగా బ్రదర్, నరసాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించబోయే ఫలితాలపై తమకు చాలా పెద్ద ఆశలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఓ యూ ట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు, టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిగతా రాజకీయ పార్టీల్లా.. మాకు ఇన్నిసీట్లు వస్తాయి.. అన్ని సీట్లు వస్తాయని అని చెప్పబోమని చెబుతూనే 90 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు 150 సీట్లు రావొచ్చేమో.. ఎందుకు రాకూడదు..? వైఎస్ జగన్, చంద్రబాబుకే మాత్రమే వస్తాయా..? మాకెందుకు రాకూడదు..? అని నాగబాబు చెప్పుకొచ్చారు.
ఇంకా ఆలోచించలేదు..
"ప్రజలు వారి తీర్పును వాళ్లు ఇచ్చేశారు. దానిపై మాట్లాడటం అనవసరం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా? లేక ప్రభుత్వంలో భాగస్వామి అవుతామా? అనేంత దూరం మేం ఇంకా ఆలోచించలేదు. మేం రాజకీయాల్లో మార్పు కోసం వచ్చాం. సమాజంలో బాధ్యతాయుతమైన రాజకీయం చేయాలని కల్యాణ్ బాబు, మేము వచ్చాం. కాబట్టి అందులో సక్సెస్ లేదా ఫెయిల్యూర్ గురించి అస్సలు ఆలోచించం. మాది 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. కాబట్టి అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? రాకుంటే కింగ్ మేకర్ అవుతామా? అన్న ఆలోచనే మాకు లేదు. మేం రాజకీయాలను చచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు" అని నాగబాబు చెప్పుకొచ్చారు.
ఏం మాకెందుకు రాకూడదు..?
"జనసేన గెలుస్తుందని నమ్మకం ఉంది. 90 సీట్లు మాకు రావొచ్చు . ఎందుకు రాకూడదు..? ఏం ఓన్లీ జగన్ గారికే వస్తాయా? చంద్రబాబు గారికే వస్తాయా? వాళ్లు మాత్రమే రాసిపెట్టుకున్నారా? మాకు 150 సీట్లు కూడా రావొచ్చేమో? అని వ్యాఖ్యానించారు. మేం కుల రాజకీయాలను చేయబోం. మేం రాజకీయాల్లోనే ఉంటాం. ప్రజల సమస్యలపైనే పోరాడుదాం" అని నాగబాబు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎంపీ అభ్యర్థి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ జనసేనకు 80 సీట్లతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసిన విషయం విదితమే.
కాగా.. మే-23న వెలువడనున్న ఫలితాల్లో ఏ పార్టీ సత్తా ఏంటో..? ఎవరి సీఎం పీఠాన్ని ఎక్కబోతున్నారు..? అనేది తేలిపోనుంది. కాగా జనసేనకు ఎన్ని సీట్లొస్తాయి..? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయ్..? టీడీపీకి ఎన్ని సీట్లొస్తాయ్..? అనే లెక్క తేలిపోవాలంటే మే-23వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout