జనసేన మేనిఫెస్టో విడుదల
- IndiaGlitz, [Wednesday,April 03 2019]
జనసేన పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేసింది. బుధవారం రోజున 20 పేజీలతో కూడిన మేనిఫెస్టోను పార్టీ ప్రకటించింది. జనసేన అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనే విషయాలను ఇందులో పేర్కొన్నది. ఇందులో మొత్తం 96 పాయింట్లను చేర్చడం జరిగింది. కాగా ఏపీలో ఇదివరకే ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ ఇంత వరకూ మేనిఫెస్టోను ప్రకటించకపోవడం గమనార్హం.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు...
రైతులకు రూ.8వేలు పెట్టుబడి సాయం
60 ఏళ్ల పైబడిన రైతులకు పెన్షన్
కేజీ టూ పీజీ పేద విద్యార్థులకు ఉచిత విద్య
ఇంటర్ విద్యార్థులకు లాప్‌టాప్‌లు
ఉద్యోగుల సీపీఎస్ రద్దు
ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500 నుంచి రూ.3500 వరకు నగదు జమ
చేస్తామని మేనిఫెస్టోలో పార్టీ ప్రకటించింది.
జనసేన ముఖ్యంగా దృష్టిసారించే అంశాలు
1. ప్రజా సంక్షోమంలోను, సంపద పంపిణీలోనూ అందరికీ సమాన అవకాశాలు కల్పించడం
2. పటిష్టమైన శాంతి భద్రతల నిర్వహణ. వివక్షత లేకుండా చట్టాలు అమలు చేయడం
3. రైతులు మరియు మత్స్యకారుల రక్షణకు పటిష్టమైన చట్టాల రూపకల్పన
4. నిరుద్యోగ సమస్యను పారద్రోలి, యువతకు అవకాశాలు కల్పించడానికి యుద్ధ ప్రాతిపదికన సన్నాహాలను ప్రారంభించడం.
5. సాంఘికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా వెనుకబడిన యువత మరియు బడగు, బలహీన వర్గాల ప్రజలకు సాధికారత కలిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం
6. పేదరిక నిర్మూలన, ప్రజలకు కనీసం అవసరాలకల్పన, సంపద సృష్టించడం మరియు సంక్షేమాన్ని కల్పించడం వంటి వాటి ప్రాధాన్యత
7. రాజ్యాంగబద్ధమైన, పారదర్శకమైన పాలనను అందివ్వడం.