Janasena:8 మందితో జనసేన అభ్యర్థుల జాబితా విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధమైంది. ఈ మేరకు పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. బీజేపీతో పొత్తులో భాగంగా మొత్తం 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించిన జనసేన.. తాజాగా 8 మందితో కూడిన జాబితాను విడుదల చేసింది.
అభ్యర్థుల జాబితా ఇదే..
కూకట్ పల్లి - ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు - నేమూరి శంకర్ గౌడ్
కోదాడ - మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూలు - వంగా లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం - మిర్యాల రామక్రిష్ణ
కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావు పేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీకి జనసేన పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ సీటు తన అనుచరుడికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ స్థానం పెండింగ్‌లో ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com