Janasena : పరామర్శలో పళ్లికిలిస్తారా.. అది మన బటన్ రెడ్డికే సాధ్యం : జగన్‌పై జనసేన నేత రియాజ్ సెటైర్లు

  • IndiaGlitz, [Saturday,July 30 2022]

కాపు సామాజిక వర్గంతోపాటు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ షేక్ రియాజ్. శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కులం చూడం... మతం చూడం... ప్రాంతం చూడం.. అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి బటన్ రెడ్డి... అన్ని వర్గాలను నిలువునా ముంచారని ఆరోపించారు. కాపు నేస్తం కార్యక్రమంలో కాపులు అమ్ముడుపోతారని బటన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే వేదికపై ఉన్న కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లి పళ్ళు ఇకిలించే వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి బటన్ రెడ్డి మాత్రమేనంటూ రియాజ్ సెటైర్లు వేశారు.

జర్నలిస్ట్ కాటా సత్యనారాయణ హత్య వెనుక దాడిశెట్టి రాజా:

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి అవాకులు చవాకులు పేలుతుంటే అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి దాడిశెట్టి రాజా వత్తాసు పలుకుతూ మాట్లాడారని రియాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాధికారం కోసం కాపులు జనసేన వెంట నడుస్తుంటే... అదే సామాజిక వర్గానికి చెందిన విలేకరి కాటా సత్యనారాయణను మంత్రి రాజా చంపించిన మాట వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అరకు నుంచి గంజాయిని తెప్పించి తుని నియోజకవర్గంలో నిల్వ చేసి వివిధ ప్రాంతాలకు తరలించే పనిలో రాజా పాత్ర ఉన్న మాట వాస్తవం కాదా? అని రియాజ్ నిలదీశారు. దాడిశెట్టి రాజా, అతని కుటుంబం చేసే దొంగ బంగారం వ్యాపారం గురించి నియోజకవర్గంలో కథలు కథలుగా చెబుతారని ఆయన ఎద్దేవా చేశారు. మంత్రివర్గంలో అత్యంత వ్యసనపరుడు ఎవరు అని చేతులు ఎత్తమంటే రెండు చేతులూ ఎత్తగల ఘనుడు దాడిశెట్టి రాజా అని రియాజ్ దుయ్యబట్టారు. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి సభకు రెండు పెగ్గులు ప్రెసిడెంట్ మెడల్ వేసుకొని వెళ్లి ఉంటాడని అనిపిస్తోందని ఆయన సెటైర్లు వేశారు.

అంతకుముందు కాపుల సంక్షేమానికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్. కాపుల సంక్షేమం కోసం ఏటా రూ.2 వేలు కోట్లు కేటాయిస్తామని చెప్పారంటూ మండిపడ్డారు. గత మూడేళ్లలో కాపులకు ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. వివిధ పథకాలకు ఇచ్చిన నిధులన్నీ కాపుల కోటాలో చూపిస్తూ మోసం చేయడం మానుకొని, కాపులకు ఈ ప్రభుత్వం చేసిన అసలైన లబ్ధిని చూపించాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈబీసీ కోటాలో కాపులకి ఉన్న రిజర్వేషన్ తొలగించి కాపు జాతికి ద్రోహం చేసింది జగన్ రెడ్డి అని విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More News

Janasena : కాపులు ఓట్లు అమ్ముకున్నారా, రుజువు చేయకుంటే ... జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: పంతం నానాజీ

మొదటి నుంచి కాపులను కించపరచడానికి.. వారిని అవహేళన చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ. కాకినాడ

దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది: అశ్వనీదత్

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.

Janasena Party : దసరా నుంచి ఏపీ రాజకీయాల్లో మార్పులు.. పవన్ యాత్రతో ఇకపై సంచలనాలే : నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు

వ్యవసాయం కోసం చేసిన అప్పుల భారంతో బలవన్మరణానికి పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ముందుకు వెళ్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

Janasena: ఈ సీఎం వస్తాడు, వెళ్తాడు.. వరద బాధితులకు ఉపయోగమేంటీ, జనం ఆలోచన ఇదే : నాదెండ్ల మనోహర్

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జరిపిన పర్యటన బాధితుల్లో కనీస భరోసా నింపలేకపోయిందన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఏదో డ్రామా కంపెనీ కార్యక్రమం జరిగినట్లు అనిపించిందని...

Janasena : వరదలు తగ్గాక తీరిగ్గా వస్తారా ... బాధితులకు రూ.10 వేల సాయం ఇవ్వాల్సిందే: జనసేన నేత కందుల

గోదావరి వరదల కారణంగా నిరాశ్రయులైనవారు, రైతాంగం, పేదలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇక్కట్లు,