Nadendla Manohar:అంగన్‌వాడీలంటే జగన్‌కు చిన్నచూపు.. జనసేన అండగా నిలుస్తుంది : నాదెండ్ల మనోహర్
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. తమ సమస్యలు పరిష్కరించాలంటూ చలో విజయవాడ చేపట్టిన అంగన్‌వాడీ వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై నాదెండ్ల స్పందించారు. అంగన్‌వాడీల ఆందోళనకు జనసేన పార్టీ తరపున మద్ధతు ప్రకటించారు. ఎన్నికల సమయంలో అంగన్‌వాడీలకు హామీలిచ్చిన జగన్ అధికారంలోకి రాగానే మాట తప్పారు, మడమ తిప్పారని మండిపడ్డారు. అంగన్‌వాడీ వ్యవస్థను సమర్దంగా నిర్వహించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని నాదెండ్ల దుయ్యబట్టారు. గర్భవతులు, బాలింతలు, పసిబిడ్డలు ఆరోగ్యంగా వుండేలా చూడటంతో అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్లు ఎంతో కీలకమన్నారు.
మినీ అంగన్‌వాడీలను రద్దు చేశారు :
2019 ఎన్నికలకు ముందు వీరికి జగన్ ఎన్నో హామీలిచ్చారని.. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని మనోహర్ ఫైర్ అయ్యారు. ఆ హామీలను అమలు చేయాలని అడినందుకు అంగన్‌వాడీ మహిళలను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాష్ట్ర ప్రజలకు లేదా అని నాదెండ్ల ప్రశ్నించారు. మాట ఇచ్చి మడమ తిప్పిన అంగన్‌వాడీ మహిళలకు జగన్ సమాదానం చెప్పాలని మనోహర్ డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వ్యవస్ధను బలోపేతం చేయాల్సిందిపోయి.. మినీ అంగన్‌వాడీలను రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. అంగన్‌వాడీల పోరాటానికి జనసేన పార్టీ మద్ధతు ఇస్తుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి విజయ యాత్ర :
ఇకపోతే.. అక్టోబర్ 1 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహి విజయ యాత్రను నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సోమవారం వెల్లడించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నుంచి మచిలీపట్నం, పెడన, కైకలూరు మీదుగా యాత్ర సాగేల ప్రణాళిక సిద్ధమైంది. పూర్తి షెడ్యూల్‌ను తదుపరి సమావేశంలో ఖరారు చేయాలని నాదెండ్ల నిర్ణయించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout