16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో జనసేన ఐదో జాబితా
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. జనసేన అధిష్టానం బుధవారం అర్ధరాత్రి మరో జాబితాను (ఐదో జాబితా) విడుదల చేసింది. ఇప్పటి వరకూ విడుదల చేసిన జాబితాలన్నీ అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేయడం గమనార్హం. నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు.
లోక్‌సభ అభ్యర్థులు..
1. విజయనగరం: ముక్కా శ్రీనివాసరావు
2. కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు
3. గుంటూరు: బి శ్రీనివాస్
4. మహబూబాబాద్ (తెలంగాణ): భాస్కర్ నాయక్
అసెంబ్లీ అభ్యర్థులు..
1. సాలూరు- బోనెల గోవిందమ్మ
2. పార్వతీపురం- గొంగడ గౌరీ శంకరరావు
3. చీపురుపల్లి- మైలపల్లి శ్రీనివాసరావు
4. విజయనగరం- పెదమజ్జి హరిబాబు
5. బొబ్బిలి- గిరదా అప్పలస్వామి
6. పిఠాపురం- మాకినీడు శేషుకుమారి
7. కొత్తపేట- బండారు శ్రీనివాసరావు
8. రామచంద్రపురం- పోలిశెట్టి చంద్రశేఖర్
9. జగ్గంపేట- పాటంశెట్టి సూర్యచంద్రరావు
10. నూజివీడు- భాస్కరరావు
11. మైలవరం- అక్కల రామ్మోహన్ రావు
12. సత్తెనపల్లి- వై.వెంకటేశ్వర రెడ్డి
13. పెదకూరపాడు- పుట్టి సామ్రాజ్యం
14. తిరుపతి- చదలవాడ కృష్ణమూర్తి
15. శ్రీకాళహస్తి- వినుత నగరం
16. గుంతకల్లు- మధుసూదన్ గుప్తా
కాగా వీరిలో చాలా వరకు సీనియర్ నేతలు ఉండగా.. మరికొందరు రాజకీయాలకు కొత్తవారే. ఇదిలా ఉంటే నిన్నా మొన్నాపార్టీలో చేరిన వ్యక్తులకు ఎలాంటి అభ్యర్థిత్వాలు, అప్లికేషన్ వ్యవహారాలులేకుండా టికెట్లు ఇచ్చేయడం గమనార్హం. దీంతో తమకు టికెట్లిస్తారని భావించిన ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తూ జంపింగ్‌లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను సీరియల్ ఎపిసోడ్స్లాగా విడుదల చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments