అమ్మకు జనసేన నీరాజనం
Send us your feedback to audioarticles@vaarta.com
విప్లవ నాయకి, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన ప్రియతమ జయలలిత మరణం నన్ను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. అనారోగ్యంతో హాస్పటల్ లో చేరిన ఆమె సంపూర్ణ ఆయురారోగ్యాలతో తిరిగి ఇంటికి చేరుకుంటారని దేశ ప్రజలతో పాటు నేను ఆశించాను అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలియచేసారు. అయితే ఆమె తిరిగిరాని లోకాలకు పయనమై మనల్ని అందర్నీ తీవ్ర దుఃఖంలో వదలి వెళ్లారు.
మూడు దశాబ్ధాలకు పైగా తమిళనాడు భారతదేశ రాజకీయాలపై జయలలిత చెరగని ముద్ర వేశారు. తమిళ ప్రజలు అమ్మగా కొలుచుకునే జయలలిత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా, శ్వాసగా జీవించారు. పేద ప్రజల కోసం తమిళనాడు అంతటా ఆమె అమలు జరిపిన సంక్షేమ పథకాలు సదా అనుసరణీయం. మహిళా శక్తికి ప్రబల నిదర్శనంగా నిలిచారు. అమ్మ మరణం తమిళనాడుకే కాక యావత్ దేశానికి తీవ్రలోటు. ఆమెకు మనః పూర్వక అంజలి ఘటిస్తూ నా తరుపున జనసేన పార్టీ శ్రేణుల తరుపున సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com