పవన్ ‘నిరాహార దీక్ష’పై జనసేన క్లారిటీ!
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు.. జనసేన రిలీజ్ చేసినట్లే ప్రెస్‌నోట్ ఉండటం, అంతేకాదు రాజకీయ కార్యదర్శి సంతకం కూడా ఉండటంతో జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు ఇది నిజమేనేమోనని అందరూ నమ్మారు. అంతేకాదు అందుకు కావాల్సిన సన్నాహకాలు కూడా మొదలుపెట్టారు. మరోవైపు ఈ వార్తను జనసైనికులు పెద్ద ఎత్తున వైరల్ కూడా చేశారు. తీరా చూస్తే పక్కా ఫేక్ ప్రెస్‌నోట్ అని తెలిసింది. దీంతో ఈ విషయం ఈ నోటా ఆ నోటా పడి పార్టీ అధ్యక్షుడి చెవిన పడటంతో.. జనసేన శతాగ్ని టీమ్‌తో ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇప్పించారు.
శత్రుష్నిు టీమ్ రియాక్షన్ ఇదీ..
‘నెట్టింట్లో వైరల్ అవుతున్న ప్రెస్‌నోట్ ఫేక్.. ఇలాంటి సమాచారం ఏమైనా ఉంటే పార్టీనే అధికారికంగా ప్రకటిస్తుంది. దయచేసి పుకార్లు నమ్మకండి. పార్టీకి సంబందించన వార్తలను అధిష్టానం కచ్చితంగా మీడియకు తెలియజేస్తున్నాం’ అని జనసేన జనసేన శత్రుష్నిు టీమ్ ఈ సందర్భంగా క్లారిటి ఇచ్చింది.
అసలు ఫేక్ ప్రెస్‌నోట్‌లో ఏముంది!?
‘ఆమరణ నిరాహార దీక్ష.. భవన నిర్మాణ కార్మికుల మద్దతుగా నిన్న విశాఖలో చేసిన లాంగ్ మార్చ్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వం రాబోయే రెండు వారాల్లో కార్మికులకు రక్షణ, చనిపోయిన కార్మికులకు ఎక్సగ్రెసియా ప్రకటించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని పవన్ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 17వ తేదీ అనగా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు గుంటూరు జిల్లా అమరావతి నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నానని ఈ సందర్భముగా తెలియ చేస్తున్నాము. నవంబర్!16 వ తేదీ మంగళగిరి పార్టీ ఆఫీసులో అధ్యక్షుల వారు అందుబాటులో ఉండటం జరుగుతుంది. నవంబర్ 17న జరిగే ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతు గా అన్ని నియోజక వర్గాల్లో ఆమరణ నిరాహారదీక్షలు నాయకులు చేయాలని’ ఈ సందర్భంగా ప్రెస్‌నోట్లో ప్రస్తావించాం. అందుబాటు లో ఉన్న నాయకులు ,కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు ఆమరణ నిరాహార దీక్షకుమీ వంతు సహకారం ఉండాలని ఆకాంక్షించారు’ అని ఫేక్ ప్రెస్‌నోట్‌లో ‘శత్రుష్నిు టీమ్’ ప్రస్తావించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout