Pawan Kalyan:కర్మ సిద్ధాంతం ఒకటుంది.. గుర్తుంచుకోండి : ఏపీ బ్యూరోక్రాట్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌గా జస్టిస్ అబ్ధుల్ నజీర్ నియామకం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో స్పందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి హెచ్చరిక సంకేతాలు అందినట్లేనని ఆయన హెచ్చరించారు. అలాగే వైసీపీకి మద్ధతుగా వుంటున్న ప్రభుత్వ అధికారులకు కూడా పవన్ కల్యాణ్ చురకలంటించారు. అలాంటి అధికారులు ఇప్పటికైనా జాగ్రత్త పడాలని ఆయన హితవు పలికారు.
ఆ అధికారులు కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకోవాలి:
కర్మ అనేది యూనివర్సల్ లా అన్న ఆయన.. మీరు ఏది విత్తుతారో, అదే మొలకెత్తుతుందని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వికృత పాలన సాగిస్తోందంటూ జస్టిస్ గోపాల గౌడ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. గోపాల్ గౌడ మాటలను అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని.. వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న అధికారులను ప్రజలు గమనిస్తున్నారని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రైవేట్ సైన్యం మాదిరిగా పనిచేస్తోందని జనసేనాని దుయ్యబట్టారు.
జస్టిస్ ఎస్ అబ్ధుల్ నజీర్‌కు పవన్ శుభాకాంక్షలు:
ఇకపోతే.. ఏపీకి కొత్త గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు వెలువరించారని.. నిష్పాక్షికంగా రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు లోబడి తీర్పులు ఇచ్చి, న్యాయమూర్తి స్థానం గౌరవానికి వన్నె తెచ్చారు. న్యాయ పీఠం నుంచి వర్తమాన భారతాన్ని పరిశీలించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు అవగతమేనని భావిస్తున్నాను. న్యాయకోవిదుడిగా తన విశేష అనుభవంతో రాష్ట్రంలో రాజ్యంగ స్పూర్తిని ఇనుమడింప చేస్తారని ఆకాంక్షిస్తున్నానని’’ పవన్ కల్యాణ్ ట్వీట్లో పేర్కొన్నారు.
“Karma is the universal law of cause and effect. You reap what you sow.”Hope every bureaucrat who’s blindly supporting the YCP would understand the concept called karma.
— Pawan Kalyan (@PawanKalyan) February 12, 2023
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments