తెలంగాణపై పవన్ కల్యాణ్ ఫోకస్.. రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటన, షెడ్యూల్ ఇదే
Send us your feedback to audioarticles@vaarta.com
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలపై సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటి వరకు ఏపీపైనే ఫోకస్ పెట్టిన ఆయన తెలంగాణలోనూ కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా ఈ నెల 20న (రేపు) ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్ రానున్నట్లు జనసేన నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్ మేకల సతీష్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తూ.. మార్గమధ్యంలో చౌటుప్పల్‌లో పవన్ ఆగుతారని ఆయన చెప్పారు. వలిగొండ మండలం గోపరాజుపల్లికి చెందిన పార్టీ కార్యకర్త సైదులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఈ క్రమంలోనే అతని భార్య, పిల్లలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. ఇందుకు సంబంధించి చౌటుప్పల్‌లో జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచి హుజూర్ నగర్‌కు చెందిన జన సైనికుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తారని సతీశ్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా లక్కారం గ్రామాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా జనసేన ఇన్‌ఛార్జి మేకల సతీష్‌రెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి గురువారం రాత్రి సందర్శించారు. ఇక్కడి జనసేన కార్యకర్తలతో సమావేశమై పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.
ఇకపోతే.. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈ నెల 8న ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శిరివెళ్ల గ్రామంలో కౌలు రైతులను పరామర్శించారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా వారికి పార్టీ తరపున రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments