Pawan Kalyan : స్వల్ప అనారోగ్యానికి గురైన పవన్ కళ్యాణ్.. నేతలతో మీటింగ్ వాయిదా, టెన్షన్‌లో ఫ్యాన్స్

  • IndiaGlitz, [Tuesday,June 27 2023]

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయ యాత్రలో భాగంగా ప్రస్తుతం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యాత్రతో పాటు ఉపవాస దీక్ష కూడా చేస్తూ వుండటంతో జనసేనాని అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పెదఅమిరంలోని నిర్మలా దేవి ఫంక్షన్ హాల్‌లో పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో ఉదయం 11 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో జరగాల్సిన సమావేశాన్ని రీ షెడ్యూల్‌ చేశారు. విశ్రాంతి అనంతరం గురువారం మధ్యాహ్నం నేతలతో పవన్ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇతర పార్టీలకు చెందిన నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈరోజు జనసేనలో చేరనున్నారు. మరోవైపు.. పవన్ అనారోగ్యానికి గురికావడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.

వారాహి నవరాత్రుల సందర్భంగా పవన్ దీక్ష :

కాగా.. శక్తివంతమైన వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని జూన్ 20 నుంచి పవన్ కల్యాణ్ దీక్ష చేస్తున్నారు. ఇది జూలైతో ముగుస్తుంది. దీక్ష కావడంతో పవన్ ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదు. కేవలం పాలు, పండ్లను మాత్రమే తీసుకుంటున్నారు. దీంతో బాగా నీరసించిపోయి అస్వస్థతకు గురవుతున్నారు. వచ్చే నెలలో వారాహి దీక్ష ముగిసిన వెంటనే పవన్ చాతుర్మాస దీక్షను ప్రారంభించే అవకాశాలు వున్నాయని సమాచారం.

ప్రభాస్ అభిమానులకు పవన్ థ్యాంక్స్ :

నిన్న సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తన సభకు పక్కనే ప్రభాస్‌ అభిమానులు ప్రదర్శించిన ఫ్లెక్సీని చూసి ఆయనకు ధన్యవాదాలు తెలిపారు పవన్. ప్రభాస్ సినిమాలు చేయడం వల్ల 500 నుంచి 1000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభాస్ కాదు.. ఎలాన్ మస్క్ కాదు, మరి జగన్‌కు అంత సంపద ఎక్కడి నుంచి వచ్చిందని పవన్ ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, పైరవీలు చేసి సంపాదించిన సొమ్ముని ఆయన దుయ్యబట్టారు. టీనేజ్‌లో వున్నప్పుడు జగన్ ఓ ఎస్ఐని కొట్టి.. సెల్‌లో వేశాడని, అలాంటి వ్యక్తికి పోలీసులు సెల్యూట్ చేస్తున్నారని పవన్ మండిపడ్డారు.

గోదావరి జిల్లాల్లో వైసీపీని గెలవనివ్వను :

పుట్టుకతోనే ఎవరూ వైవీ సుబ్బారెడ్డిలా తెల్లగడ్డంతో పుట్టరని, రాజకీయాల్లో కిందపడి, నలిగి ఓ స్థాయికి వస్తారని పవన్ పేర్కొన్నారు. 2008లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తాను అనుభవం తెచ్చుకున్నానని ఆయన తెలిపారు. రాజ్యాధికారానికి దూరంగా వున్న వర్గాలను కలుపుకుని వెళ్తానని పవన్ కల్యాణ్ తెలిపారు. బీసీలకు, కాపులకు మధ్య గొడవపెట్టాలని చూశారని, తుని రైలు ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలిసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాలను ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్‌గా తీర్దిదిద్దుతామన్నారు. నియోజకవర్గానికి 500 మంది చొప్పున ఒక్కో యువకుడికి రూ.10 లక్షలు ఆర్ధిక సాయం అందించి, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని పవన్ తెలిపారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో వైసీపీని ఒక్క సీటు కూడా గెలవకుండా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. పులివెందుల రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలు ఈ ప్రాంతానికి ససేమిరా రానివ్వమని పవన్ తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే జగన్ పోవాలి, జనసేన రావాలని ఆయన పిలుపునిచ్చారు.

More News

Pawan Kalyan:ప్రభాస్ సినిమాలు చేసి సంపాదిస్తే.. జగన్ అక్రమాలతో వెనకేశారు : నర్సాపురంలో పవన్

వారాహి విజయయాత్రలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

Jr Ntr Fan:ఎన్టీఆర్ వీరాభిమాని మృతిపై మిస్టరీ : జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోన్న ఫ్యాన్స్ , ట్రెండింగ్‌లో #WeWantJusticeForShyamNTR

యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కు ప్రాంతాలు, కుల, మతాలకు అతీతంగా కోట్లాది మంది అభిమానులు వున్నారు.

KTR:కేసీఆర్‌తో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదు.. జేపీ నడ్డాకు కేటీఆర్ స్టైల్ వార్నింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పెట్టుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,

Owaisi:మా వాళ్లనే అరెస్ట్ చేస్తారా, బోధన్‌లో బీఆర్ఎస్‌ను ఓడిస్తాం .. మరిన్ని స్థానాల్లోనూ బరిలోకి ఎంఐఎం: ఒవైసీ

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు .. ఆయనకు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Delhi:ఢిల్లీలో సినీ ఫక్కీలో చోరీ : గన్‌తో బెదిరించి, కారును అడ్డగించి .. రూ. లక్షలు చోరీ .. వీడియో వైరల్

కట్టుదిట్టమైన భద్రత, అడుగడుగునా సాయుధ బలగాలు సంచరించే దేశ రాజధాని ఢిల్లీలో నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి.