Pawan Tirumala Issues:దర్శనం పేరుతో దోపిడీ , ఏడుకొండలవాడితో ఆటలా .. నామరూపాల్లేకుండా పోతారు : జగన్‌కి పవన్ వార్నింగ్

  • IndiaGlitz, [Saturday,June 17 2023]

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సాగు, అక్రమ రవాణాపై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి విజయయాత్రలో భాగంగా పిఠాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్‌ను గంజాయికి దేశ రాజధానిగా వైసీపీ మార్చిందని ఆరోపించారు. రాష్ట్రం నుంచి రవాణా అవుతున్న గంజాయి దేశంలోనే అధికమని, ఆంధ్రప్రదేశ్ గంజాయి మత్తులో తూగేలా తయారు చేశారని పవన్ వ్యాఖ్యానించారు. మన్యంలో విపరీతంగా గంజాయి పడుతుంటే, దాన్ని రవాణా చేసి వైసీపీ నాయకులు లాభపడుతున్నారని జనసేనాని ఆరోపించారు. ఏపీలోని ప్రతి గ్రామంలోనూ, వీధిలోనూ బహిరంగంగా గంజాయి దొరికే పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో గంజాయిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం రావాలని.. జనసేన ప్రభుత్వంలో నిజాయతీ గల పోలీసు అధికారులకు స్వేచ్ఛగా వారి విధులను నిర్వర్తించేలా అధికారం కట్టబెడతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పోలీసులు వారి విధులను ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి కాకుండా చేస్తే సమాజం అద్భుతంగా తయారవుతుందని ఆయన ఆకాంక్షించారు.

నాతో కష్టం చెప్పుకుందని.. ఆ అమ్మాయి అన్నని చంపేశారు:

తాడేపల్లిలో నివసించే ఆ ఆడ బిడ్డ తన ఇంటిని సీఎం నివసిస్తున్న రోడ్డు వెడల్పు కోసం కూల్చేశారని, పరిహారం ఇవ్వలేదని తన దగ్గర వచ్చి కష్టం చెప్పుకుందని పవన్ గుర్తుచేశారు. దీని గురించి నేను మాట్లాడతానని హామి ఇచ్చిన తర్వాత మళ్లీ అదే ఆడబిడ్డ 10 రోజులకు మళ్లీ పార్టీ కార్యాలయం వద్ద కనిపించిందని తెలిపారు. జనంలో నిల్చుని వుంటే తాను పిలిచి మాట్లాడగా.. ఆ తల్లి చెప్పిన విషయాలు తనకే కన్నీళ్లు తెప్పించాయని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను కలిసి, వినతిపత్రం ఇచ్చిన తర్వాత నుంచి వైసీపీ నాయకులు ఆమెను వేధించడం మొదలుపెట్టారని ఆయన మండిపడ్డారు. ఇంట్లోకి కూరగాయాలు తీసుకొస్తానని చెప్పిన అన్నను మూడు రోజుల తర్వాత ఆటోలో శవంగా తీసుకొచ్చి ఇంటి ముందు పడేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను కలిశారు అన్న ఒకే ఒక్క కారణంతో ఆ కుటుంబాన్ని వైసీపీ నాయకులు సర్వనాశనం చేశారని ఆయన మండిపడ్డారు. ఆ ఆడబిడ్డ వేదన, కన్నీటి తడి నుంచే జనవాణి కార్యక్రమం ప్రారంభించాలనే ఆలోచన వచ్చిందని పవన్ గుర్తుచేశారు. రాష్ట్రంలోని అందరి కన్నీటి బాధలను స్వయంగా వినాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు.

శ్రీవాణి టికెట్‌ రూ.10 వేలు.. వెయ్యి వెంకన్నకి, మిగిలిన రూ.9 వేలు ఏమవుతున్నాయి :

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోందన్నారు. శ్రీవాణి ట్రస్టు అని దర్శనం కోసం పెట్టారని.. రూ.10 వేలు కడితే దర్శనం ఉంటుందన్నారు. అయితే కట్టిన డబ్బుకు బిల్లు ఉండదని.. కేవలం రూ.1000 మాత్రమే టిక్కెట్ కేటాయించినట్లు లెక్కలుంటాయని, మిగిలిని రూ.9 వేలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఏడుకొండల స్వామితో ఆటలాడుతున్నారని.. నామరూపాలు లేకుండా పోతారని ఆయన ఆరోపించారు. హిందూ ఆలయాలు, వాటి ఆస్తుల మీద వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని దేవాదాయశాఖను నిర్వీర్యం చేశారని పవన్ మండిపడ్డారు. కేవలం ఆలయాల వద్ద ఉన్న ఆస్తులను కాజేయడానికి ఈ ప్రభుత్వం చూస్తోందని జససేనాని ఆరోపించారు. జనసేన ప్రభుత్వం రాగానే.. పిఠాపురాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

More News

Pawan Kalyan:ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. వైసీపీ గుండాలకు నరకం చూపిస్తా : పవన్ కల్యాణ్

తనకు ముఖ్యమంత్రిగా ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

మన కులపోడని ఓట్లేశారు .. చూస్తున్నారుగా, క్రిమినల్స్‌ని గెలిపిస్తే ఇదే గతి : జగన్‌పై పవన్ ఆగ్రహం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, దర్యాప్తు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Janasena Chief Pawan Kalyan:ఇంట్లో కూర్చుంటే అధికారం రాదు .. మీరు బలపడండి, పార్టీని బలోపేతం చేయండి : నేతలకు పవన్ పిలుపు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరుగుతోంది.

Janasena:జనసేనతోనే ఏపీకి పునర్వైభవం .. మన ప్రభుత్వంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరుగుతోంది.

LGM: రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'LGM'

జూన్ 15, హైద‌రాబాద్‌: ఇండియ‌న్ క్రికెట్ హిస్ట్రరీలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.