Janasena Chief Pawan Kalyan:ఫ్యామిలీ మొత్తానికి దోచుకోవడమే పని .. ద్వారంపూడి అంటే వైసీపీ నాయకులకీ భయమే : పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అయితే అందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. గతంలో కాకినాడ పోర్టు నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యేదని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఏకంగా 56 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. రేషన్ డీలర్లు, మిల్లర్లు, పేదల వద్ద రేషన్ బియ్యం తీసుకొని అక్రమ రవాణా చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాకినాడ పోర్టు కేంద్రంగా డెకాయిట్ ద్వారంపూడి వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 15 వేల కోట్లు దోచుకున్నాడని వ్యాఖ్యానించారు.
కన్నబాబు, తోట త్రిమూర్తులు ఏం చేస్తున్నారు :
నాన్న పౌర సరఫరాల సంస్థ చైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇలా కుటుంబం మొత్తం మూకుమ్మడిగా దోచేశారని ఆరోపించారు. ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధర లేక కన్నీరు పెడుతుంటే.. వారి కన్నీటిపై వీళ్లు సంపాదిస్తున్నారని దుయ్యబట్టారు. కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి నాయకులు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అన్నా, సీఎం సన్నిహితుడిగా పేరొందిన ద్వారంపూడి అన్నా వైసీపీ సీనియర్ నాయకులకు భయమేనని.. కానీ పవన్ కళ్యాణ్‌కు అలాంటి భయాలు లేవన్నారు. డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని, నటోరియస్, ఫ్యాక్షన్ మైండ్ ఉన్న ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎదుర్కొంటామని ఆయన హెచ్చరించారు.
నోటాకి వేసే ఓట్లు జనసేనకి వేయ్యండి :
ఎందెందు వెతికినా అందందు ద్వారంపూడి అక్రమాల లీలలే కనిపిస్తున్నాయని పవన్ ఆరోపించారు. కాకినాడలో కుంభాభిషేకం ప్రాంతాన్ని, శివాలయాన్ని పోర్టు కోసం అని చెప్పి కబ్జా చేశారని పేర్కొన్నారు. శివాలయం ముఖ ద్వారం ముందు గోడకట్టేశారని.. ద్వారంపూడి దగ్గర 500 మంది గుండాలు ఉంటే మనమెంతమందో ఒక్క సారి చూసుకోవాలన్నారు. మధ్యతరగతి మేధావుల మౌనం, భయమే క్రిమినల్స్ రాజ్యమేలాలా చేస్తున్నాయని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. 3 నుంచి 4 శాతం నోటాకు ఓట్లు వేశారని.. ఆ ఓట్లు జనసేనకు వేయాలని ఆరోపించారు. మన ప్రభుత్వంలో రౌడీలు, గుండాలను తన్ని తరిమేస్తామని తన సొంత హెచరీస్‌కు సుద్దగెడ్డ దగ్గర వంతెన కట్టుకున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా బెడ్లు, వంట పాత్రలు పట్టుకుపోయాడు :
కొన్నేళ్ల నుంచి కనీసం అక్కడున్న గిరిజనులు వంతెన నిర్మించాలని అడిగినా పట్టించుకోలేదన్నారు. ఆఖరికి కాకినాడ నుంచి సింహాచలం వరకు చేపట్టిన పాదయాత్రలో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన పరుపులు, వంట పాత్రలు కూడా ద్వారంపూడి పట్టుకెళ్లిపోయారని పవన్ దుయ్యబట్టారు. కాకినాడను గంజాయి, డ్రగ్స్ కు అడ్డగా మార్చేశారని.. తెలంగాణ, యానాం నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి వేలకోట్లు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. విశాఖ డెయిరీ భూములు కబ్జా చేయాలని చూస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. స్వామినగర్, పెద్ద స్వామినగర్‌లో ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారని.. నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయాలన్నా 30 శాతం పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని పవన్ ఆరోపించారు. పేదోడి ఇళ్ల స్థలాల పేరిట తీరాన్ని కాపాడుతున్న మడ అడవులను నరికేశారని.. కాకినాడలో ఈ గూండాల గ్యాంగు చేయని తప్పుడు పనంటూ లేదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments