Pawan Kalyan:ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. వైసీపీ గుండాలకు నరకం చూపిస్తా : పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Saturday,June 17 2023]

తనకు ముఖ్యమంత్రిగా ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా శుక్రవారం పిఠాపురంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎంగా తనకు అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన నేల సాక్షిగా పవన్ మాటిచ్చారు. దశాబ్దం తర్వాత అన్ని అంశాల మీద పూర్తి అధ్యయనం చేసి, సంపూర్ణ అవగాహనతో ఈ మాట చెబుతున్నాను అన్నారు. రాష్ట్ర బాధ్యత తీసుకోవడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన అధికారంలోకి వస్తే పిఠాపురాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

గొడవలు జరగాలన్నదే వైసీపీ ప్లాన్ :

రాష్ట్రంలో ఎంత గొడవలు జరిగితే వైసీపీ అంత లాభపడుతుందనేది వైసీపీ నాయకుడి గేమ్ ప్లాన్ అని పవన్ కల్యాణ్ ఆరోపించారు. పిఠాపురం రాగానే తనకు రాష్ట్రంలో జరిగిన హిందూ ఆలయాల మీద దాడులు గుర్తుకొచ్చాయన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం పిఠాపురం నుంచే ఈ దాడులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. 219 హిందూ ఆలయాల మీద దాడులు, విగ్రహాల ధ్వంసం సంఘటనలు జరిగితే ఒక్కరిని కూడా వైసీపీ ప్రభుత్వం పట్టుకోలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. దీని వెనుక చచ్చు ముఖ్యమంత్రి ఆలోచన, వైసీపీ నాయకుల కుట్ర దాగుందని ఆయన ఆరోపించారు. వరుసగా హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే సనాతన ధర్మం నమ్మే హిందువులంతా వేరే మతస్థులను అనుమానించాలి, దాని ద్వారా వారితో గొడవ పడాలి ఇదే వైసీపీ కుట్ర అని పవన్ ఆరోపించారు. సమాజంలో ఘర్షణలు చెలరేగితే వైసీపీ దాని నుంచి బోలెడు లాభం పొందాలనే ఆలోచనలతోనే వరుసగా ఆలయాల మీద దాడులు జరిగాయని జనసేనాని పేర్కొన్నారు.

విగ్రహాలను ధ్వంసం చేసింది పిచ్చివాడట :

సమాజంలో ఎన్ని గొడవలు జరిగితే వైసీపీ నాయకులకు అంత ఇష్టమని.. యువకులు తమ భవిష్యత్తును వదిలేసి పోలీసు కేసుల్లో ఇరుక్కుంటే ఈ నాయకులు అంత ఆనందపడతారని చురకలంటించారు. పిఠాపురంలో మొదట హిందూ దేవతల విగ్రహం ధ్వంసం చేస్తే నిందితుడిని పిచ్చివాడు అని చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. మరి 219 దాడులు, విగ్రహాల ధ్వంసం కూడా పిచ్చివాళ్ల పనేనా..? శ్రీరాముడి విగ్రహం తల నరికింది కూడా పిచ్చివాడేనా అంటూ పవన్ ప్రశ్నించారు. ఎందుకు విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయలేదంటే వైసీపీ దగ్గర సమాధానం ఉండదన్నారు. వైసీపీ అనే దుష్ట ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఎవరినీ బతకనివ్వరని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

మళ్లీ వైసీపీ గెలిస్తే.. గూండాలు ఇంట్లోకే వచ్చేస్తారు :

ప్రతి ఇంట్లోకి వైసీపీ గుండాలు వచ్చి దోచుకుంటారని.. హంతకులు, గుండాలు, రౌడీలు, అవినీతి పరులతో వైసీపీ ప్రభుత్వం నిండిపోయిందని దుయ్యబట్టారు. వైసీపీ గుండాలకు నిలయమని పవన్ ఫైర్ అయ్యారు. నేర పూరిత రాజకీయాలంటే తనకు చిరాకన్న ఆయన.. జనసేన ప్రభుత్వంలో నేర చరితులకు స్థానం ఉండదన్నారు. ప్రతి వైసీపీ గూండాగాళ్లను బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై ప్రజలతో కొట్టించే రోజు దగ్గర్లోనే ఉందని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. క్రిమినల్ మైండ్ ఉన్న వారు పాలిస్తే క్రిమినల్స్‌కు వత్తాసు పలకకుండా ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆడబిడ్డ బయటకు వెళ్తే మళ్లీ సురక్షితంగా ఇంటికి వస్తుందా లేదా అనే భయం అందరిలోనూ ఉందన్నారు.

ఎంపీ కుటుంబానికే రక్షణ లేదు :

రాష్ట్రంలో సాక్షాత్తు ఓ ఎంపీ కుటుంబానికే రక్షణ లేకుండా పోయిదంటే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. తునిలో వైసీపీ నాయకుడి అనుచరుడు భూమి కబ్జా చేశాడని ఓ ఆడబిడ్డ ఫిర్యాదు చేస్తే, ఆమెకు పిచ్చిదనే ముద్రవేసి కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారని ఆయన ఆరోపించారు. కరోనా సమయంలో మాస్కులు లేవు అని చెప్పిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్‌ను పిచ్చివాడని ముద్ర వేసి , చనిపోయేలా చేశారని పవన్ గుర్తుచేశారు. ఓ నాయకుడు గూండాలతో బెదిరిస్తే, మరో వైసీపీ నాయకుడు బహిరంగంగా గన్‌తో తిరుగుతాడని.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ నేరాలకు అడ్డా అయిపోయిందన్నారు. జనసేన ప్రభుత్వంలో ‘‘సురక్ష ఆంధ్రప్రదేశ్’’ను సాధించి తీరుతామని పవన్ స్పష్టం చేశారు. అన్నీ వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా జనసేన బాధ్యత తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు జనసేన ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు.

పోలీస్ శాఖపై వైసీపీ ఒత్తిళ్లు :

గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలను నాశనం చేశారని, పోలీసు శాఖను నిర్వీర్యం చేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ నాయకులు చెప్పిందే చట్టం... వేసిందే శిక్ష అన్నట్లు పరిస్థితి తయారైందన్నారు. పోలీసులపై పూర్తిస్థాయిలో వైసీపీ ఒత్తిళ్లు ఉన్నాయని.. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సున్నితమైన అంశాల్లో సైతం పోలీసులు వైసీపీ నేతల ఒత్తిళ్ల వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

More News

మన కులపోడని ఓట్లేశారు .. చూస్తున్నారుగా, క్రిమినల్స్‌ని గెలిపిస్తే ఇదే గతి : జగన్‌పై పవన్ ఆగ్రహం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు, దర్యాప్తు, తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

Janasena Chief Pawan Kalyan:ఇంట్లో కూర్చుంటే అధికారం రాదు .. మీరు బలపడండి, పార్టీని బలోపేతం చేయండి : నేతలకు పవన్ పిలుపు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరుగుతోంది.

Janasena:జనసేనతోనే ఏపీకి పునర్వైభవం .. మన ప్రభుత్వంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు : పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర విజయవంతంగా జరుగుతోంది.

LGM: రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'LGM'

జూన్ 15, హైద‌రాబాద్‌: ఇండియ‌న్ క్రికెట్ హిస్ట్రరీలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.

Janasena Chief Pawan:ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే .. దాడులు, అక్రమ కేసులు.. మా నమ్మకం జనసేనే : పవన్‌తో ఉప్పాడ మత్స్యకారులు

పిఠాపురంలో పవన్ కల్యాణ్ నిర్వహించిన జనవాణి - జనసేన భరోసాకు సమస్యల వెల్లువెత్తాయి.