Pawan Kalyan:ఎన్డీయేలోకి ఏపీ నుంచి మరో పార్టీ రావొచ్చా .. విలేకరుల ప్రశ్న, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
విపక్షాలకు ధీటుగా బదులిచ్చేందుకు గాను బీజేపీ ఎన్డీయే పక్షాల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని అశోకా హోటల్లో ఈ భేటీ జరిగింది. 30కు పైగా పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన పార్టీ ఒక్కటే ఎన్డీయే సమావేశంలో పాల్గొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , మరో నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఎన్డీయే భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రాలేదు :
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగింది అని పవన్ స్పష్టం చేశారు. నాని ఫాల్కివాలా చెప్పినట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడడమే గొప్ప విషయమన్నారు. పార్లమెంట్ మీద తీవ్రవాదుల దాడి తర్వాత తనకు కూడా అదే అనిపించిందని.. దేశానికి బలమైన నాయకత్వం అవసరం అనిపించిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంతో దేశం మరింత పటిష్టమైందని జనసేనాని ప్రశంసించారు. దేశానికి పటిష్ట నాయకత్వం వల్ల వచ్చే జరిగే మేలు ఏమిటి అన్నది భారతదేశమంతా గమనిస్తోందని పవన్ పేర్కొన్నారు.
పొత్తులు, సీట్లపై చర్చించలేదు :
ఎన్డీఏ పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, దేశ ప్రజలకు అత్యున్నత జీవన విధానం అందించేందుకు, అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి అన్నదానిపై చర్చ జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భారతదేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ఎన్డీయే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పార్టీ చేరే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout