Pawan Kalyan:ఎన్డీయేలోకి ఏపీ నుంచి మరో పార్టీ రావొచ్చా .. విలేకరుల ప్రశ్న, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Wednesday,July 19 2023]

విపక్షాలకు ధీటుగా బదులిచ్చేందుకు గాను బీజేపీ ఎన్డీయే పక్షాల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఈ భేటీ జరిగింది. 30కు పైగా పార్టీల అధినేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన పార్టీ ఒక్కటే ఎన్డీయే సమావేశంలో పాల్గొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , మరో నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఎన్డీయే భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన రాలేదు :

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎన్డీఏ సమావేశంలో చర్చ జరగలేదని, దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగింది అని పవన్ స్పష్టం చేశారు. నాని ఫాల్కివాలా చెప్పినట్లు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గుండె ధైర్యంతో నిలబడడమే గొప్ప విషయమన్నారు. పార్లమెంట్ మీద తీవ్రవాదుల దాడి తర్వాత తనకు కూడా అదే అనిపించిందని.. దేశానికి బలమైన నాయకత్వం అవసరం అనిపించిందని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. 2014లో నరేంద్ర మోడీ నాయకత్వంతో దేశం మరింత పటిష్టమైందని జనసేనాని ప్రశంసించారు. దేశానికి పటిష్ట నాయకత్వం వల్ల వచ్చే జరిగే మేలు ఏమిటి అన్నది భారతదేశమంతా గమనిస్తోందని పవన్ పేర్కొన్నారు.

పొత్తులు, సీట్లపై చర్చించలేదు :

ఎన్డీఏ పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఏ విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్లాలి, దేశ ప్రజలకు అత్యున్నత జీవన విధానం అందించేందుకు, అభివృద్ధి సాధించేందుకు ఎలాంటి విధానాలు తీసుకురావాలి అన్నదానిపై చర్చ జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులు, సీట్ల సర్దుబాటు మీద మాట్లాడలేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భారతదేశ రాజకీయాలు, భవిష్యత్తు వ్యూహాలపైనే ఎన్డీయే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది అన్నారు. ఈ సందర్భంగా విలేకరులు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పార్టీ చేరే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు అని పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు.

More News

Pooja Hegde:పూజా హెగ్డే అందాల సెగలు .. పింక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసిన బుట్టబొమ్మ, చూపు తిప్పుకోవడం కష్టమే

టాలీవుడ్ అగ్రనేత పూజా హెగ్డే గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తెలుగులో అగ్ర కథానాయకులందరి సరసన నటించిన ఈ భామ..

LGM:ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎమోష‌న్స్‌తో రూపొందిన ‘ఎల్‌జీఎం’ (LGM - Lets Get Married) తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల‌

మారుతున్న ట్రెండ్‌లో ప్రేమ‌కు అర్థం మారిపోయింది. అమ్మాయి అబ్బాయి లివ్ ఇన్ రిలేష‌న్‌లో ఉండి..

Pawan Kalyan:ఎన్డీయే సమావేశానికి పవన్ కళ్యాణ్ .. పొత్తులపై సంచలన వ్యాఖ్యలు, సీఎం పదవి పైనా క్లారిటీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అన్ని పార్టీల నేతలు అభ్యర్ధుల ఎంపిక నుంచి అన్ని విషయాలపై ఫోకస్ పెట్టారు.

Prem Kumar:ఫ‌న్ రైడ‌ర్‌గా సంతోష్ శోభ‌న్ ‘ప్రేమ్ కుమార్’ ... ఆకట్టుకుంటోన్న ట్రైలర్

టాలీవుడ్‌లో కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫ‌రెంట్ మూవీస్‌తో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ ప్రేమ్‌కుమార్‌గా

Panchkarla Ramesh Babu:జనసేనలోకి పంచకర్ల .. ముహూర్తం ఖరారు, పెందుర్తిలో పోటీపై రమేష్ బాబు స్పందన ఇదే

ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.