ACB 14400 App: వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ఫిర్యాదు చేయాలంటే ఏ యాప్ వాడాలి : పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Monday,June 06 2022]

రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో వున్న అవినీతిని కట్టడి చేసేందుకు గాను కొద్దిరోజుల క్రితం 14400 మొబైల్ యాప్‌‌ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌. ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ యాప్‌ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులు చేసేందుకు సర్కార్ వీలు కల్పించింది సర్కార్‌. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగినా.. ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వాయిస్ కాల్, వీడియో, ఫోటో ఆధారాలను కూడా ప్రభుత్వానికి అందజేయవచ్చు.

ఇక్కడి వరకు బాగానే వుంది కానీ.. ఈ యాప్‌పై సోషల్‌ మీడియాలో జగన్‌ సర్కార్‌పై విపరీతమైన ట్రోల్‌ జరిగింది. అవినీతి కేసుల్లో అరెస్ట్‌ అయి.. జైలులో ఉండొచ్చి.. కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈయన అవినీతిని అరికడతాడంట అంటూ ప్రతిపక్షాలు టార్గెట్‌ చేశాయి. సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు పెడుతూ ప్రశ్నించాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఏసీబీ యాప్‌పై విమర్శలు చేశారు. మరి వైసీపీ పాలకుల అవినీతి గురించి, వారి ఎమ్మెల్యేల దోపిడీ, దౌర్జన్యాల మీద ఫిర్యాదు చెయ్యాలంటే ప్రజలు ఏ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

ఎక్కడైనా, ఎవరైనా , కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందని.. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

More News

APSSCResults2022 : ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల.. ప్రకాశం ఫస్ట్, అనంతపురం లాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు.

భాగ్యనగరంలో బోనాల జాతరకు ముహూర్తం ఖరారు.. తేదీలు ఇవే, నెల రోజులూ పండుగే

హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పర్వదినాల్లో బోనాలు ఒకటి.

Pawan Kalyan: సీఎం అభ్యర్ధిగా పవన్‌ని ప్రకటించండి .. జేపీ నడ్డాను కోరిన జనసేన నేత పోతిన మహేశ్

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేశ్.

జగన్ మదిలో ముందస్తు ఆలోచన.. కోనసీమలో చిచ్చు వైసీపీ కుట్రే : నాదెండ్ల మనోహర్

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఈ ప్రభుత్వం ఆరాటపడుతోందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రజాబలం లేక, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచే దారి లేక కులాల మధ్య చిచ్చు పెట్టాలని

Nadendla Manohar: ఇగోలోద్దు.. పవన్‌ను సీఎంగా చూడాలంటే కష్టపడండి : శ్రేణులకు నాదెండ్ల దిశానిర్దేశం

పార్టీ నిర్మాణమంటే సామాన్యమైన విషయం కాదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక వ్యక్తితో అది సాధ్యం కాదని.. సమష్టిగా కష్టపడితేనే పార్టీని అద్భుతంగా నిర్మించుకోగలమని