ACB 14400 App: వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై ఫిర్యాదు చేయాలంటే ఏ యాప్ వాడాలి : పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలోని ప్రభుత్వ విభాగాల్లో వున్న అవినీతిని కట్టడి చేసేందుకు గాను కొద్దిరోజుల క్రితం 14400 మొబైల్ యాప్‌ను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఏసీబీ ఆధ్వర్యంలో పనిచేసే ఈ యాప్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై ఫిర్యాదులు చేసేందుకు సర్కార్ వీలు కల్పించింది సర్కార్. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగినా.. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వాయిస్ కాల్, వీడియో, ఫోటో ఆధారాలను కూడా ప్రభుత్వానికి అందజేయవచ్చు.
ఇక్కడి వరకు బాగానే వుంది కానీ.. ఈ యాప్‌పై సోషల్ మీడియాలో జగన్ సర్కార్‌పై విపరీతమైన ట్రోల్ జరిగింది. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయి.. జైలులో ఉండొచ్చి.. కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఈయన అవినీతిని అరికడతాడంట అంటూ ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు పెడుతూ ప్రశ్నించాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఏసీబీ యాప్‌పై విమర్శలు చేశారు. మరి వైసీపీ పాలకుల అవినీతి గురించి, వారి ఎమ్మెల్యేల దోపిడీ, దౌర్జన్యాల మీద ఫిర్యాదు చెయ్యాలంటే ప్రజలు ఏ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
ఎక్కడైనా, ఎవరైనా , కలెక్టరేట్ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందని.. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com