పవన్ సంచలన నిర్ణయం.. త్వరలో రెండు రాష్ట్రాల్లో నారసింహ యాత్ర
Send us your feedback to audioarticles@vaarta.com
రాజకీయంగా యాక్టీవ్ అవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేయాలని ఆయన ఫిక్స్ అయ్యారు. జనసేన సోషల్ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్య్యూలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు, సమకాలిన అంశాలపై పవన్ తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని కాంక్షిస్తూ త్వరలో ‘‘అనుష్టు నారసింహ యాత్ర’’ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న నరసింహ ఆలయాల మీదుగా యాత్ర చేస్తున్నట్లు తెలిపారు.
కొండగట్టు నుంచి పవన్ యాత్ర ప్రారంభించనున్నారు. అయితే అది ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. 30 ఆలయాలను సందర్శిస్తూ సాగే ఈ యాత్ర ఎలా ఉంటుందన్నది కూడా తెలియాల్సి ఉంది. అలాగే పవన్ కల్యాణ్ పాదయాత్ర చేస్తారా లేక బస్సు యాత్ర చేస్తారా అనేది కూడా తెలియరాలేదు. ఈ యాత్ర ఎజెండా, కార్యచరణ, షెడ్యూల్ వంటి విషయాలపై త్వరలోనే పవన్ క్లారిటీ ఇస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ ఘాటుగా బదులిచ్చారు. ప్రజలకే తాను దత్తపుత్రుడినని.. ఎప్పుడైనా తాను ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మాట్లాడతానని జనసేనాని స్పష్టం చేశారు. ప్రభుత్వం సృష్టించిన ఉద్యోగల సమస్యలపై తాము మాట్లాడితే తప్పేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఈ సమస్య విపక్షాలు తీసుకురాలేదని.. ఇచ్చిన హామీ నెరవేర్చలేక ప్రభుత్వం సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని ఆయన వ్యాఖ్యానించారు. వచ్చిన సమస్యను పరిష్కరించాల్సిన మంత్రులు, ప్రభుత్వ పెద్దలు ఉద్యోగులను రెచ్చగొట్టి ఇంత వరకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వం పద్ధతిగా ఉంటే ఉద్యోగులు రోడ్లపైకి ఎందుకు వస్తారని జనసేనాని ప్రశ్నించారు. మంత్రులందరూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. ప్రభుత్వం మరింత సమర్థంగా పనిచేయాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com