Pawan Kalyan:మహారాష్ట్రలో 'ఓజీ' షూటింగ్.. పవన్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన జనసైనికులు, పవర్‌స్టార్ లుక్ వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నారు. సినిమాలను, రాజకీయాలను బ్యాలెన్స్డ్గా నడిపిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏమాత్రం కలిగి వున్నా తన సమయాన్ని రాజకీయాలకే కేటాయిస్తున్నారు. ఈ సారి పాలిటిక్స్‌లో సత్తా చాటాలని జనసేనాని గట్టి పట్టుదలగా వున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టడం లేదు.
పవన్ చేతిలో మూడు సినిమాలు:
ఇదిలావుండగా.. పవన్ కల్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు వున్నాయి. వీటన్నింటిని వేగంగా పూర్తి చేసి సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారంతో పవన్ బిజీ కానున్నారు. దీనిని దృష్టిలో వుంచుకునే షూటింగ్‌లు త్వరగా ముగించాలని కూడా పవన్ నుంచి దర్శక నిర్మాతలకు ఆదేశాలు వెళ్లినట్లుగా ఫిలింనగర్లో చర్చ జరుగుతోంది.
మహారాష్ట్రలో ఓజీ షూటింగ్ :
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓజీ సినిమా షూటింగ్ ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగింది. ఇటీవల ముంబైలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఓజీ.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని ఇతర లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్కడ వై లేక్ వద్ద యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో జనసేన కార్యకర్తలు.. పవన్‌కి సర్ప్రైజ్ ఇచ్చారు. సరస్సు తీరంలో ముగ్గురు జనసైనికులు పార్టీ జెండాను పవన్‌కు చూపించారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ‘‘మహారాష్ట్రలోని వాయి సరస్సు వద్ద ఓజీ షూటింగ్ చేస్తుండగా.. కొవ్వూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ముగ్గురు జన సైనికులు సింగిరి సాయి, సింగిరి రాజేశ్, సన్నీ జాన్‌లను కలిశానని పవన్ పేర్కొన్నారు.
ఖుషి తర్వాత మళ్లీ కరాటే డ్రెస్ వేసిన పవన్ :
మరోవైపు.. ఈ ఫోటోలో పవన్ కరాటే డ్రెస్‌లో కనిపించారు. గతంలో ఖుషి సినిమాలో ఆయన ఆ లుక్‌లో కనిపించారు. అలాగే తన కోసం వచ్చిన జనసైనికులతో పవన్ సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com