Pawan Kalyan:ఇందుకే నువ్వు దేవుడివి సామి.. వారాహి ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన పవన్, వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈపేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా.. తెలుగు చలనచిత్ర సీమ రికార్డులను తిరగరాసిన స్టార్‌గా, మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తమ్ముడిగా ఆయన అందరికీ సుపరిచితం. సూపర్‌స్టార్ అయినప్పటికీ.. ఒదిగి వుండే తత్వం ఆయనది. ఆపదల్లో వున్న వారిని ఆదుకునేవరకు పవన్ విశ్రమించరు. సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఎంతో బిజీగా వుంటూ కొంత సమయం ప్రజల కోసం కేటాయించి రియల్ స్టార్ అనిపించుకున్నారు. ఇలాంటి లక్షణాలే ఆయనను మిగిలిన హీరోలతో ప్రత్యేకంగా నిలబెట్టింది.
పవన్ రాకతో బ్లాక్ అయిన నేషనల్ హైవే :
తాజాగా మరోసారి పవన్ మానవత్వం చాటుకున్నారు. జనసేన పార్టీ పదవ వార్షికోత్సవం ఇవాళ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు గాను విజయవాడ ఆటోనగర్‌కు నుంచి బందర్ సభా స్థలి వరకు భారీ ర్యాలీగా బయల్దేరారు జనసేన. పవన్ రాక విషయం తెలుసుకున్న అభిమానలు, ప్రజలు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపైకి భారీగా చేరుకున్నారు. దీనికి తోడు వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలతో పవన్‌ను ఆయన అభిమానులు అనుసరించారు. దీంతో బందర్ రోడ్డు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ , అభిమానులను ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ కల్యాణ్.
జనం, వాహనాల మధ్య చిక్కుకున్న అంబులెన్స్ :
ఈ క్రమంలో పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఈడ్పుగల్లు వద్ద ఓ అంబులెన్స్ పవన్ ర్యాలీలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పవన్.. తన వారాహి వాహనాన్ని పది నిమిషాల పాటు ఆపి అంబులెన్స్‌కు దారిచ్చారు. తన అభిమానులకు కూడా అంబులెన్స్‌ను వెళ్లనివ్వాలని కోరారు. వారాహి వాహనంపై నిలబడి అంబులెన్స్‌కు రూట్ క్లియర్ చేయించారు. అంబులెన్స్ డ్రైవర్, లోపల వున్న వారు పవన్‌కు నమస్కారం తెలియజేసి ముందుకు వెళ్లిపోయారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మానవతావాదిగా పవన్ మరోసారి రుజువు చేసుకున్నాని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com