Pawan Kalyan:ఇందుకే నువ్వు దేవుడివి సామి.. వారాహి ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన పవన్, వీడియో వైరల్

  • IndiaGlitz, [Wednesday,March 15 2023]

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈపేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా.. తెలుగు చలనచిత్ర సీమ రికార్డులను తిరగరాసిన స్టార్‌గా, మెగాస్టార్ చిరంజీవి ముద్దుల తమ్ముడిగా ఆయన అందరికీ సుపరిచితం. సూపర్‌స్టార్ అయినప్పటికీ.. ఒదిగి వుండే తత్వం ఆయనది. ఆపదల్లో వున్న వారిని ఆదుకునేవరకు పవన్ విశ్రమించరు. సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఎంతో బిజీగా వుంటూ కొంత సమయం ప్రజల కోసం కేటాయించి రియల్ స్టార్ అనిపించుకున్నారు. ఇలాంటి లక్షణాలే ఆయనను మిగిలిన హీరోలతో ప్రత్యేకంగా నిలబెట్టింది.

పవన్ రాకతో బ్లాక్ అయిన నేషనల్ హైవే :

తాజాగా మరోసారి పవన్ మానవత్వం చాటుకున్నారు. జనసేన పార్టీ పదవ వార్షికోత్సవం ఇవాళ కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు గాను విజయవాడ ఆటోనగర్‌కు నుంచి బందర్‌ సభా స్థలి వరకు భారీ ర్యాలీగా బయల్దేరారు జనసేన. పవన్ రాక విషయం తెలుసుకున్న అభిమానలు, ప్రజలు విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపైకి భారీగా చేరుకున్నారు. దీనికి తోడు వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలతో పవన్‌ను ఆయన అభిమానులు అనుసరించారు. దీంతో బందర్ రోడ్డు ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ , అభిమానులను ఉత్సాహ పరుస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ కల్యాణ్.

జనం, వాహనాల మధ్య చిక్కుకున్న అంబులెన్స్ :

ఈ క్రమంలో పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని ఈడ్పుగల్లు వద్ద ఓ అంబులెన్స్ పవన్ ర్యాలీలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పవన్.. తన వారాహి వాహనాన్ని పది నిమిషాల పాటు ఆపి అంబులెన్స్‌‌కు దారిచ్చారు. తన అభిమానులకు కూడా అంబులెన్స్‌ను వెళ్లనివ్వాలని కోరారు. వారాహి వాహనంపై నిలబడి అంబులెన్స్‌కు రూట్ క్లియర్ చేయించారు. అంబులెన్స్ డ్రైవర్, లోపల వున్న వారు పవన్‌కు నమస్కారం తెలియజేసి ముందుకు వెళ్లిపోయారు . ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మానవతావాదిగా పవన్ మరోసారి రుజువు చేసుకున్నాని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

More News

New Secretariat:ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్ : ముహూర్తం ఇదే.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న మేష లగ్నంలో ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు

Alekhya Reddy:తండ్రిలా తోడు, తల్లిలా లాలన.. ఆయనే మా కుటుంబం : బాలయ్యపై తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది.

Janasena :జనసేన పదేళ్ల ప్రస్థానం.. ఆవిర్భావ సభలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేనా, పవన్ ఏం చెప్పబోతున్నారు..?

ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం తర్వాత .. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో శూన్యత మధ్య రాజకీయాల్లోకి ప్రవేశించారు

Katha Venuka Katha:‘కథ వెనుక కథ’.. మార్చి 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న సస్పెన్స్ థ్రిల్ల‌ర్

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్.

Malavika Nair :ఓ మంచి అనుభూతినిచ్చే చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' - మాళవిక నాయర్

'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో