క్రిమినల్స్‌కు అధికారమిస్తే ఇంతే.. మా వాళ్లని వదలకుంటే వైజాగ్‌లోనే వుంటా : పవన్ అల్టీమేటం
Send us your feedback to audioarticles@vaarta.com
నేర స్వభావం వున్న క్రిమినల్స్‌కు అధికారం ఇస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నిన్న విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఘటన, తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన స్పందించారు. రాత్రికి రాత్రి తమ పార్టీకి చెందిన వందమందిని పోలీసులు అరెస్ట్ చేశారని.. వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లో క్రిమినలైజేషన్ జరిగితే ఇలాంటి పరిస్ధితులు వస్తాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి కింద ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ పనిచేస్తోందని పవన్ చురకలు వేశారు. నేరస్తులకు కొమ్ము కాస్తూ.. తమ కార్యకర్తలపై పోలీస్ జులుం ప్రదర్శిస్తున్నారని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసును ఎందుకు పరిష్కరించలేదని పవన్ పోలీస్ శాఖను ప్రశ్నించారు.
జనసేనకు వైసీపీ భయపడుతోంది:
అధికారంలో ఉన్నవాళ్లు గర్జించడం ఏంటి అని ఆయన నిలదీశారు. చాలామంది మా జనసేన నాయకులను జనవాణికి రాకుండా ముందస్తు హోస్ అరెస్ట్‌లు చేశారని పవన్ దుయ్యబట్టారు. కోడి కత్తి కేసు అన్నది సీఎం జగన్ ఆడిన పెద్ద డ్రామా అని.. దాడి సమయంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు పోలీసు బందోబస్తు లేదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలకు జనసేన అంటే భయం పట్టుకుందని... కోనసీమలో ఎలా ఉద్రిక్తత నెలకొందో..ఇప్పుడు విశాఖలోనూ అలాగే సృష్టించారని పవన్ ఆరోపించారు.
48 శాఖలు, 28 మంది మంత్రులు ఒకరి కనుసన్నల్లోనే:
విశాఖలో తన కార్యక్రమం మూడు నెలల కిందటే నిర్ణయించామని... వైసీపీ వాళ్లు చెప్పినట్లుగా తమ కార్యక్రమాలు ఎందుకు చేస్తామని జనసేనాని నిలదీశారు. మంత్రులకు అధికారం లేదని.. కానీ 48 శాఖలు, 28 మంది మంత్రులు ఒక వ్యక్తి చెప్పినట్లు వినాలా అని ఆయన ప్రశ్నించారు. పరిపాలనా వికేంద్రీకరణ అన్నది ఒక్కరు తీసుకున్న నిర్ణయమని... ఒక్కరు తీసుకున్న దానిని వికేంద్రీకరణ అని ఎలా అంటారని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు వల్ల సంస్థలన్నీ వెనక్కి పోయాయని... బూతులు తిట్టడానికే వికేంద్రీకరణ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments