Pawan Kalyan:జగన్ పర్యటనలో చెట్ల నరికివేత .. ‘‘అందమును హత్య చేసెడి హంతకుండా’’ , వృక్షాలు విలపిస్తున్నాయి అంటూ పవన్ ట్వీట్

  • IndiaGlitz, [Monday,July 24 2023]

గత కొంతకాలంగా వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌లపై తీవ్ర విమర్శలు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన దూకుడు మరింత పెంచారు. ఇటీవల వాలంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తర్వాత బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపైనా పవన్ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా చెట్లు నరికివేతపై జనసేనాని మండిపడ్డారు. వైసీపీ పాలనలో వృక్షాలు విలపిస్తున్నాయని పవన్ దుయ్యబట్టారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కొబ్బరి చెట్లు నరికిన ఫోటోలను ఆయన ట్వీట్ చేశారు.

చెట్లను నరికిన పాపం అందరికీ చుట్టుకుంటుంది :

కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారని.. అలాంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారని.. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకుంటున్న వాళ్లు ఈ విషయం తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ చురకలంటించారు. మనకు నీడను అందించడమే కాకుండా ఆహారాన్ని కూడా అందించే చెట్లను రక్షించనప్పుడు, చివరికి ఆ కర్మ కేవలం ముఖ్యమంత్రినే కాదు ఈ పరిపాలనలో భాగమైన అందరినీ పట్టుకుంటుందని పవన్ హెచ్చరించారు. సీఎం కాకపోతే కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా విచక్షణారహితంగా చెట్లను నరికివేయవద్దని సంబంధిత అధికారులకు సూచించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ‘‘పుష్ప విలాపం’’ పద్యాలను పవన్ ప్రస్తావించారు.

‘‘ ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..

అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ ... ’’ అని పవన్ ట్వీట్ చేశారు.

సీఎం అమలాపురం పర్యటన సందర్భంగా చెట్ల నరికివేత :

ట్వీట్‌లో పవన్ కళ్యాణ్ షేర్ చేసిన ఫోటోలు ఈ నెల 26న సీఎం వైఎస్ జగన్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పర్యటన సందర్భంగా తీసినవి. ముఖ్యమంత్రి రానుండటంతో అధికారులు రోడ్లకు ఇరువైపులా వున్న కొబ్బరి, ఇతర చెట్లను నరికివేశారు. సీఎం వస్తున్నారని ఎన్నో ఏళ్లుగా పర్యావరణాన్ని కాపాడే చెట్లను నరికివేయడం దారుణమన్నారు. అమలాపురంలోని ఎస్‌కేబీఆర్ కళాశాల, కిమ్స్ మెడికల్ కళాశాలలో రెండు హెలీప్యాడ్‌లు అందుబాటులో వున్నాయి. కానీ వాటిని కాదని.. ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ వద్ద దాదాపు రూ.15 లక్షల ప్రజాధనం వెచ్చించి, అక్కడి కొబ్బరి చెట్లను ఇష్టమొచ్చినట్లు నరికివేయడంపై స్థానికులు, విపక్షాలు మండిపడుతున్నారు.

More News

Botsa Satyanarayana:బైజూస్‌పై విమర్శలు .. పవన్.. నీకు ట్యూషన్స్ చెబుతా, ఈ హోంవర్క్ చేయ్ : బొత్స సెటైర్లు

ఇప్పటికే వాలంటీర్లపై వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోన్న పవన్ కల్యాణ్.. నిన్న బైజూస్‌ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే.

RajahmundryBridge: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జిపై ఆ వాహనాల ప్రవేశంపై నిషేధం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్ వంతెనపై అధికారులు ఆంక్షలు విధించారు.

YS Viveka:వివేకా హత్య కేసు .. నాలుగేళ్లుగా ఏం తేల్చింది, సీబీఐ ట్రాక్ తప్పిందంటూ ఎండగట్టిన 'ది వైర్'

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. సింపుల్‌గా (సీబీఐ). ఈ పేరు వినగానే మిస్టరీ కేసులను విప్పిన వైనం, అంతుచిక్కని నేరాల్లో నేరస్తులను పట్టుకున్న నేర్పరితనం

Vrushabha:మోహన్‌లాల్ పాన్ ఇండియా మూవీ ‘‘వృషభ’’ మొదలు.. ది కంప్లీట్ స్టార్‌తో మేకా రోషన్, క్యాస్టింగ్ ఇదే

ప్రస్తుతం బాలీవుట్ నుంచి కోలీవుడ్ వరకు పాన్ ఇండియా మూవ్‌మెంట్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

Thiruveer:హ్యాపీ బ‌ర్త్ డే టు వెర్స‌టైల్ యాక్ట‌ర్ తిరువీర్‌.. ‘మిషన్ తషాఫి’లో తిరువీర్ క్యారెక్ట‌ర్‌ను అనౌన్స్ చేసిన జీ 5

తిరువీర్‌.. ఇప్పుడు తెలుగు సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు.