Pawan Kalyan:ఇది రాజకీయ కక్ష సాధింపే .. చంద్రబాబుకు నా పూర్తి మద్ధతు : పవన్ కల్యాణ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేయడాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే ఆయనను అరెస్ట్ చేశారని పవన్ దుయ్యబట్టారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని జనసేనాని ప్రశ్నించారు. చంద్రబాబుకు తన పూర్తి మద్ధతు వుంటుందని.. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్ట్ సరికాదని పవన్ పేర్కొన్నారు.
చంద్రబాబుపై చిత్తూరు, నంద్యాల ఘటనలు శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా వున్నాయన్నారు. వైసీపీ అధికారంలో వుండటం వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. శాంతి భద్రతల బాధ్యత పోలీసులదైదే.. వైసీపీ వాళ్లు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లొచ్చని.. అదే టీడీపీ నేతను అరెస్ట్ చేస్తే కనీసం ఆ పార్టీ శ్రేణులు ఇళ్ల నుంచి బయటకు కూడా రాకూడదా అని పవన్ నిలదీశారు. దీని నుంచి చంద్రబాబు నాయుడు త్వరగా బయటపడాలని జనసేనాని ఆకాంక్షించారు.
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన పురందేశ్వరి :
అంతకుముందు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. ఈ మేరకు శనివారం ట్వీట్ చేసిన ఆమె.. చంద్రబాబుకు సరైన నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, సరైన ప్రక్రియను ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ ఖండిస్తోందని పురందేశ్వరి స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments