Pawan Kalyan:ఇది రాజకీయ కక్ష సాధింపే .. చంద్రబాబుకు నా పూర్తి మద్ధతు : పవన్ కల్యాణ్

  • IndiaGlitz, [Saturday,September 09 2023]

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అరెస్ట్ చేయడాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే ఆయనను అరెస్ట్ చేశారని పవన్ దుయ్యబట్టారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని జనసేనాని ప్రశ్నించారు. చంద్రబాబుకు తన పూర్తి మద్ధతు వుంటుందని.. ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్ట్ సరికాదని పవన్ పేర్కొన్నారు.

చంద్రబాబుపై చిత్తూరు, నంద్యాల ఘటనలు శాంతి భద్రతకు విఘాతం కలిగించేలా వున్నాయన్నారు. వైసీపీ అధికారంలో వుండటం వల్లే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. శాంతి భద్రతల బాధ్యత పోలీసులదైదే.. వైసీపీ వాళ్లు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లొచ్చని.. అదే టీడీపీ నేతను అరెస్ట్ చేస్తే కనీసం ఆ పార్టీ శ్రేణులు ఇళ్ల నుంచి బయటకు కూడా రాకూడదా అని పవన్ నిలదీశారు. దీని నుంచి చంద్రబాబు నాయుడు త్వరగా బయటపడాలని జనసేనాని ఆకాంక్షించారు.

చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన పురందేశ్వరి :

అంతకుముందు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. ఈ మేరకు శనివారం ట్వీట్ చేసిన ఆమె.. చంద్రబాబుకు సరైన నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్‌లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, సరైన ప్రక్రియను ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను బీజేపీ ఖండిస్తోందని పురందేశ్వరి స్పష్టం చేశారు.

More News

BiggBoss Telugu 7 : శివాజీ, రతికలకు అదృష్టం దక్కనివ్వని కంటెస్టెంట్స్.. భయపెట్టిన షకీలా

చూస్తుండగానే బిగ్‌బాస్ 7 వీకెండ్‌కు చేరుకుంది. తొలివారం నామినేషన్స్ జరగగా.. గేమ్‌ను రక్తి కట్టించడానికి కంటెస్టెంట్స్‌ కిందా మీద పడుతున్నారు.

Chandrababu Naidu:టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్.. నంద్యాలలో హైడ్రామా, కాసేపట్లో విజయవాడకు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంకు సంబంధించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లుగా సీఐడీ ప్రకటించింది.

Pushpa 2 :‘పుష్ప2‘ సెట్ ఫోటోను షేర్ చేసిన రష్మిక.. సోషల్ మీడియాలో వైరల్

జాతీయ అవార్డ్ గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం పుష్ప 2.

Chandramukhi 2:సెప్టెంబర్ 28న రాఘవ లారెన్స్, ‘చంద్రముఖి 2’ రిలీజ్

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో

ఏపీ విద్యా విధానం భేష్.. ఇలాంటి సంస్కరణలే కావాలి , జగన్‌పై నోబెల్ అవార్డ్ గ్రహీత ప్రశంసలు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తోంది.. అభివృద్ధి శూన్యం, పారిశ్రామిక రంగం నాశనం అంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం కొనసాగిస్తోంది.