close
Choose your channels

Pawan kalyan: ఈసారి వాళ్లు తగ్గాల్సిందే.. నా మూడు ఆప్షన్స్ ఇవే : పొత్తులపై పవన్ కామెంట్స్

Sunday, June 5, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Pawan kalyan: ఈసారి వాళ్లు తగ్గాల్సిందే.. నా మూడు ఆప్షన్స్ ఇవే : పొత్తులపై పవన్ కామెంట్స్

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనసేన, బిజెపి మధ్య బంధం గట్టిగా ఉందని స్పష్టం చేశారు. కరోనా వల్ల తమకు సోషల్ డిస్టెన్స్ వచ్చిందని పవన్ కల్యాణ్ అన్నారు. నడ్డా ఏపీకి వస్తున్న సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. తనకు ముందుగా ఉన్న కార్యక్రమాల వల్ల ఆయనను కలవలేక పోతున్నానని పవన్ తెలిపారు. బీజేపీ జాతీయ నాయకులతో కూడా మాట్లాడానని.. రైతుల సమస్యలు, రాష్ట్రంలో పరిస్థితులు కూడా వివరించానని జనసేనాని వెల్లడించారు.

Pawan kalyan: ఈసారి వాళ్లు తగ్గాల్సిందే.. నా మూడు ఆప్షన్స్ ఇవే : పొత్తులపై పవన్ కామెంట్స్

‘‘తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు’’ :

ఒకప్పుడు వార్ వన్‌సైడ్ అయ్యిందని.. ఇప్పుడు వన్ సైడ్ లవ్ అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. టిడిపి వాళ్లు పూర్తి క్లారిటీతో వస్తే అప్పుడు ఆలోచిద్దామని.. మనందరిలో ఐక్యత ఉందా లేదా ఆలోచించాలని పవన్ అన్నారు. 2014లో తాను తగ్గి... రాష్ట్రాన్ని గెలిపించానని ఆయన గుర్తుచేశారు. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు అనే బైబిల్ సూక్తి నమ్ముతానని పవన్ పేర్కొన్నారు. జగన్ మాత్రం అందరినీ తగ్గించి ఆయన మాత్రమే ఎదుగుతాడని.. 2014, 2019లో తగ్గామని... 2024లో తగ్గేదే లేదని జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను సిఎం అభ్యర్థి అని బిజెపి నేతలు ఎవరూ చెప్పలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అన్ని సార్లు తగ్గామని.. ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని భావిస్తున్నానని పవన్ వెల్లడించారు.

జనసేన ముందు మూడు ఆప్షన్స్:

జనసేన ముందు మూడు అవకాశాలు వున్నాయని ఒకటి . బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. రెండు బీజేపీ, టీడీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. మూడు జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అని అన్నారు. ఈసారి ప్రజలు గెలవాలని కోరుకుంటున్నానని.. పొత్తుల అంశాన్ని జనసైనికులు లైట్ తీసుకోవాలని, గొడవలు పెట్టుకోవద్దని పవన్ కల్యాణ్ హితవు పలికారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment