Pawan kalyan : కౌలు రైతు భరోసా యాత్రకు రూ.5 లక్షల విరాళం.. తదేకం ఫౌండేషన్‌కు పవన్ ప్రశంసలు

  • IndiaGlitz, [Tuesday,July 19 2022]

తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మహావతార్ బాబాజీ స్ఫూర్తితో గురూజీ నౌషీర్ ప్రారంభించిన ‘తదేకం ఫౌండేషన్’ చేస్తున్న సామాజిక సేవా, సంక్షేమ కార్యక్రమాలు అందరిలో సేవా దృక్పథాన్ని కలిగిస్తోందన్నారు. జనసేన పార్టీ నాయకులు, శ్రేణులతో కలసి తదేకం ఫౌండేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలు మహిళలకు, వికలాంగులకు ఉపయుక్తంగా ఉన్నాయని పవన్ కల్యాణ్ ప్రశంసించారు.

కౌలు రైతు భరోసా యాత్రకు రూ.5 లక్షల సాయం:

వికలాంగులకు ట్రై సైకిల్స్ ఇవ్వడంతోపాటు మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి మెషిన్లు అందజేస్తున్నారని కొనియాడారు. తదేకం ఫౌండేషన్, జనసేన సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమాలను ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి, సుధ జనసేన అధినేతకు వివరించి గురూజీ పంపిన సందేశాన్ని అందచేశారు. అనంతరం జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు తమ వంతుగా ఫౌండేషన్ తరఫున రూ.5 లక్షల విరాళం అందచేశారు. ఈ సమావేశంలో పార్టీ పిఏసీ సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు.

గతంలోనూ పవన్‌ని కలిసిన తదేకం ఫౌండేషన్ సభ్యులు:

ఏపీలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి, సాయి సుధ, నీలేశ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ హైదరాబాదులో పవన్ కల్యాణ్ ను కలిసిన సంగతి తెలిసిందే. తదేకం ఫౌండేషన్ కార్యాచరణ వివరాలు తెలుసుకున్న ఆయన వారిని అభినందించారు. మహావతార్ బాబాజీ స్ఫూర్తితో నౌషీర్ గురూజీ ప్రారంభించిన తదేకం ఫౌండేషన్ సేవలను మరింత ముందుకు తీసుకెళుతున్నారంటూ ప్రశంసించారు. తదేకం ఫౌండేషన్ కార్యక్రమాలకు అనేకమంది ప్రముఖులు, యువత, జనసైనికులు కూడా మద్దతుగా నిలుస్తుండడం సంతోషదాయకమని పవన్ కల్యాణ్ జనసైనికులు ఇకపైనా ఇదే స్ఫూర్తి కనబర్చాలని పిలుపునిచ్చారు.

More News

Parampara 2: "పరంపర 2" లో గోపీ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది - నవీన్ చంద్ర

హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్...ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర.

Janasena : జనవాణికి అద్భుత స్పందన.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: నాదెండ్ల మనోహర్

సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో జనసేన పార్టీ “జనవాణి -జనసేన భరోసా” కార్యక్రమం చేపట్టిందన్నారు

Janasena : ఆయన దాడిశెట్టి రాజా కాదు.. బోడిశెట్టి రాజా, మీకు ఇవ్వాల్సింది పెగ్గు.. పేకాట శాఖ: కిరణ్ రాయల్

రాష్ట్రంలోని రోడ్ల పరిస్ధితి, పవన్ కల్యాణ్‌పై మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలపై స్పందించారు జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్.

Janasena: వైసీపీ మళ్లీ వచ్చిందా .. ఏపీని ఎవ్వరూ కాపాడలేరు, ఆడపడచులారా ఆలోచించండి: పవన్ కల్యాణ్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Janasena : మేమూ లోకల్ మాసే.. మీకంటే బాగా బూతులు తిట్టగలం, జాగ్రత్త: వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్

విద్యా రంగం మీద దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం దాని లెక్కలు బయటకు తీయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్