ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న జనసేన-బీజేపీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో కొనసాగుతున్న పొత్తును తెలంగాణలోనూ కొనసాగించేందుకు జనసేన-బీజేపీ సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసి పోటీ చేసేందుకు రంగం సిద్ధమైంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు 12 స్థానాల్లో నామినేషన్ వేశారు. అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఇప్పటికే 10 డివిజన్లను జనసేనకు బీజేపీ కేటాయించింది. ఆదివారం నామినేషన్ చివరి రోజు కావడంతో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు శ్రీ శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు, ఖమ్మం జిల్లా ఇన్‌చార్జి రామ్ తాళ్ళూరి నేతృత్వంలో అభ్యర్థులతో నామినేషన్ వేయించారు.
ముస్తఫా నగర్ నుంచి ర్యాలీగా బయలుదేరి, ప్రకాశ్ నగర్, గాంధీ చౌక్, సారధి నగర్, ఎఫ్ సీ ఐ, బైపాస్ రోడ్ మీదుగా డీఆర్‌డీఏ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. శంకర్ గౌడ్, రామ్ తాళ్ళూరి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి వి.వి. రామారావు, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి దుంపటి శ్రీనివాస్, ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మిరియాల జగన్, సమన్వయకర్త ఎండీ సాదిక్ అలీ, ప్రధాన కార్యదర్శి సురభి సూరజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన అభ్యర్థులు వీరే..
1. మిరియాల జగన్ - 23వ డివిజన్
2. ధనిశెట్టి భానుమతి - 48వ డివిజన్
3. గరదాసు సుమలత - 47వ డివిజన్
4. భోగా హరిప్రియ - 28 వ డివిజన్
5.A బండారు రామకృష్ణ- 16 వ డివిజన్
5.B నల్లగట్ల శ్రీనివాస రావు - 16 వ డివిజన్
6. బోడా వినోద్ - 8 వ డివిజన్
7. గుండా పవన్ కళ్యాణ్ - 60 వ డివిజన్
8. సింగారపు చంద్రమౌళి - 51 వ డివిజన్
9. తూము ఉమామహేశ్ - 2 వ డివిజన్
10. యాసా మురళీకృష్ణ - 13 వ డివిజన్
11. మైలవరపు మణికంఠ - 36 వ డివిజన్
12. యాసంనేని అజయ్ కృష్ణ - 14 వ డివిజన్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments