Janasena: అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే జనసేన అభ్యర్థులు వీరే..

  • IndiaGlitz, [Monday,March 25 2024]

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 21 స్థానాలకు గానూ 18 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ ప్రకటించారు. తొలుత 5 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అనంతరం ఇద్దరు అభ్యర్థులను వెల్లడించారు. తాజాగా మరో 11 స్థానాలను అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇక అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అలాగే కాకినాడ ఎంపీ స్థానానికి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారు చేయగా.. మచిలీపట్నం ఎంపీ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే వంగవీటి రాధా పార్టీలో చేరే అవకాశాలున్నాయని.. ఆయన పార్టీలో చేరితో మచిలీపట్నం ఎంపీగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అలాగే సిట్టింగ్ ఎంపీ బాలశౌరిని అవనిగడ్డ అభ్యర్థిగా ఎంపిక చేస్తారని సమచారం. కుదరని పక్షంలో అవనిగడ్డ నుంచి రాధాను, బందర్ ఎంపీగా బాలశౌరిని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

18 మంది అభ్యర్థులు వీరే..

పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌
తెనాలి - నాదెండ్ల మనోహర్‌
అనకాపల్లి - కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్‌ - పంతం నానాజీ
నెల్లిమర్ల - లోకం మాధవి
భీమవరం - పులపర్తి ఆంజనేయులు
తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్‌
నిడదవోలు - కందుల దుర్గేష్‌
రాజానగరం - బత్తుల బలరామకృష్ణ
పెందుర్తి - పంచకర్ల రమేష్‌ బాబు
యలమంచిలి - సుందరపు విజయ్‌ కుమార్‌
పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ
రాజోలు - దేవ వరప్రసాద్‌
నరసాపురం - బొమ్మిడి నాయకర్‌
ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు
పోలవరం - చిర్రి బాలరాజు
తిరుపతి - అరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు - భాస్కరరావు

ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీకి చేయనుండగా జననసేన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక బీజేపీ 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలు తప్ప దాదాపుగా అన్ని అన్ని స్థానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఇక బీజేపీ కూడా ఎంపీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేసింది. మొత్తంగా చూసుకుంటే కూటమి తరపున 175 స్థానాలకు గాను 157 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా.. 25 ఎంపీ స్థానాలకు 21 మందిని ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను ఒకట్రెండు రోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉంది.