కాలుజారి కిందపడ్డ సింగర్ జానకీ.. తీవ్రగాయాలతో చికిత్స
- IndiaGlitz, [Saturday,May 04 2019]
ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్ జానకి (81) ఆస్పత్రిపాలయ్యారు. మైసూరులో బంధువుల ఇంటికి వెళ్లిన జానకీ ప్రమాదవశాత్తూ జారి కిందపడ్డారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.! హుటాహుటిన ఆమె బంధువులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. కాగా.. ఆమె కాలు తుంటి భాగంలో పగులు కనిపించినట్లు వైద్య పరీక్షలు తేలిందని సమాచారం. జానకీ కాలుకు శస్త్రచికిత్స చేయడంతో ప్రస్తుతం జానకి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి జానకీ గానీ.. ఆమె తరఫు బంధువులు గానీ స్పందించలేదు. దీంతో జానకీకి ఏమైందో ఏమో అని అభిమానులు, సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా.. గతంలో కూడా జానకీ బాత్రూంలో కాలు జారి కిందపడటంతో తలకు తీవ్రగాయమైన సంగతి తెలిసిందే. తిరుపతిలోని భీమాస్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎలాంటి అపాయం లేకుండా తలకు ఆరు కుట్లు వేయడంతో జానకీ క్షేమంగా ఆస్పత్రి నుంచి తిరిగొచ్చారు. జానకి తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ తదితర పలు భారతీయ భాషల్లో పాటలు పాడిన కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు ఈమె గాత్రానికి నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డులు, వివిధ రాష్ట్రాల్లో 31 ఫిల్మ్ అవార్డులు దక్కాయి.