Pawan Kalyan:కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పవన్ .. కమలనాథుల వ్యూహం అదేనా..?

  • IndiaGlitz, [Monday,April 03 2023]

దక్షిణాదిలో వున్న పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ పేర్కొంది. మే 10న పోలింగ్, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏప్రిల్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు తుది గడువు ఏప్రిల్ 20.. ఏప్రిల్ 21న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఏప్రిల్ 24గా నిర్ణయించారు. ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

ఎత్తులు పైఎత్తులతో కాంగ్రెస్, బీజేపీ:

ఈ నేపథ్యంలో మరోసారి అధికారాన్ని అందుకోవాలని కమలనాథులు.. ఈసారి బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. దీనికి తోడు హంగ్ వస్తే మరోసారి కింగ్ మేకర్ కావాలని జేడీఎస్ కూడా పావులు కదుపుతోంది. అయితే ఇప్పటి వరకు వెలువడిన సర్వేలన్నీ కాంగ్రెస్‌దే విజయమని చెబుతున్నాయి. అయితే బీజేపీకి కూడా మెజార్టీ స్థానాలు దక్కుతాయనే అంటున్నాయి. కానీ కర్ణాటక పీసీసీ నేతలు మాత్రం ఐకమత్యంగా వుంటూ పనిచేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి కాంగ్రెస్ గెలుపే తమ లక్ష్యమని చెబుతూ.. సీఎం కుర్చీ సంగతి తర్వాత చూద్దాం అని అంటున్నారు.

కర్ణాటకకు బీజేపీ పెద్దల క్యూ:

కానీ బీజేపీని తక్కువగా అంచనా వేయడానికి లేదు. గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చి పవర్‌లోకి వచ్చింది. ఎన్నో రాష్ట్రాల్లో సొంత బలం లేకున్నప్పటికీ ఆయా నేతలను పార్టీలోకి లాగి అధికారాన్ని ఏర్పాటు చేసింది. అలాంటిది ఇంత బలంగా వున్న కర్ణాటకను వూరకనే వదిలేస్తుందా. సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు కర్ణాటకకు క్యూకడుతున్నారు. ప్రధాని మోడీ అయితే వరుస ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను మొదలెట్టేశారు.

కర్ణాటకలో పెద్ద సంఖ్యలో స్థిరపడ్డ తెలుగువారు:

ఇక కర్ణాటకలో తెలుగువారి ప్రాబల్యం అధికం. గతంలోని హైదరాబాద్- కర్ణాటక ప్రాంతంతో పాటు ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తెలుగువారు పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. బళ్లారి, రాయచూర్, సింధనూరు, గంగావతి, దావణగిరె, గుల్బార్గ, బీదర్, హుబ్లీ, ధార్వాడ్, చిత్రావతి, తుమకూరు, మైసూర్‌లలో తెలుగు జనాభా అధికం. ఇక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరంలో లక్షలాది మంది తెలుగువారు ఉద్యోగ, వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో వీరు అనేక నియోజకవర్గాల్లో నిర్ణయాత్మక శక్తిగా వున్నారు. ఈ క్రమంలోనే తెలుగువారిని ఆకట్టుకునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని రంగంలోకి దించాలని కమలనాథులు భావిస్తున్నారు. గతంలోనూ 2014 ఎన్నికల సమయంలో మోడీ విజ్ఞప్తి మేరకు పవన్ కల్యాణ్ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి.. బీజేపీ అభ్యర్ధుల విజయానికి దోహదపడ్డారు. ఇప్పుడు అదే ఫార్ములానే కాషాయ నేతలు అమలు చేయాలని చూస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్‌కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. కాకపోతే.. నిప్పు లేకుండా పొగ రాదు కదా.

More News

SBI:మొరాయించిన ఎస్‌బీఐ సర్వర్.. ఆన్‌లైన్ సేవలకు అంతరాయం, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఇటీవలి కాలంలో పలు బ్యాంక్‌ల సర్వర్లు మొరాయిస్తూ వుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Pawan Kalyan : ఢిల్లీలో జనసేనాని.. బీజేపీతో పొత్తుపై తేల్చేస్తారా , పవన్ మనసులో ఏముందో..?

ఎన్నికలకు ఏడాది వుండగానే ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం హాట్ హాట్‌గా మారిపోయింది.

Game On:దసరా థియేటర్స్ లో 'గేమ్ ఆన్' టీజర్ సందడి

గీతానంద్, నేహా సోలంకి (90 ఎంఎల్  ఫేమ్ )హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్,

China:'విద్యార్ధులూ.. ప్రేమించుకోండి' : వారం పాటు సెలవులు.. చైనా కాలేజీల వింత నిర్ణయం, ఎందుకిలా ..?

ప్రపంచంలోని పలు దేశాలు జనాభా పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాల్లో విపరీతంగా జనాభా పెరిగిపోతుంటే..

Costume Krishna: టాలీవుడ్‌లో మరో విషాదం.. నిర్మాత, నటుడు కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే కే విశ్వనాథ్, జమున, సాగర్, తారకరత్న మరణాలతో