‘థూ నీ బతుకు చెడ’ అంటూ చిరుపై జనసైనికుల ఫైర్

మెగాస్టార్ చిరంజీవిపై జనసైనికులు ఓ రేంజ‌్‌లో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా.. చిరుని దూషిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఏపీ సీఎం జగన్ సినీ పరిశ్రమకు వరాలు కురిపించిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ పెద్దగా ఉన్న మెగాస్టార్ వెంటనే జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇదే ఆయనపై ట్రోలింగ్‌కు కారణమైంది. దీంతో పవన్ అభిమానులు ఆయనపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. పవన్ రాజకీయ జీవితం నాశనం కావడానికి ఒకరకంగా చిరంజీవే కారణమంటూ దూషించారు. చిరును చూస్తుంటే అసహ్యం వేస్తోందంటూ మండిపడ్డారు.

పవన్ పార్టీ పెట్టి పైకి రావాలని కష్టపడుతుంటే ఆ జైలు(జగన్) గాడికి డబ్బా కొడతావా? అంటూ రెచ్చిపుోయారు. ‘చిరంజీవి అన్న నువ్వు ఆ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అంతగా సపోర్ట్ చేస్తున్నారు. ఒక పక్కన పవనన్న ఆ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పొరుడుతుంటే మీరు సపోర్ట్ చేసేది పోయి, మీరే ఇలా చెయ్యటం చాలా దారుణం. ఇలా మీరు చేయటం వల్ల జనసేనకి చాలా ఇబ్బంది అవుతుంది, మీ పోస్ట్స్‌కి ఆ జఫ్ఫా బ్యాచ్ చూడండి’ అంటూ ఓ నెటిజన్ కాస్త డీసెంట్‌గానే మెసేజ్ పెడితే.. ‘సర్, మీ బాధ ఏంటో మాకు అసలు అర్థం కావడం లేదు’ అంటూ మరో నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు.

మరొకరైతే ‘నువ్వు ఒక్కడివి చాలురా నాయన పవన్ సంకనకి పోవడానికి, అసహ్యం వేస్తుంది నిన్ను చూస్తుంటే.. పార్టీ పెట్టి కలిపేశావు. పవన్ పార్టీ పెట్టి కష్టపడుతుంటే ఆ జైలు గాడికి నువ్వు డబ్బా కొడుతున్నావు’అంటూ మండిపడ్డాడు. మరొకరైతే..‘థూ నీ బతుకు చెడ’ అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. మరొక నెటిజన్ సైతం చిరు తీరును తప్పుబట్టాడు. ‘‘బాస్ ఫ్యామిలీ నుంచి ది బెస్ట్ ప్రి రిలీజ్ ఈవెంట్స్‌లో ఒకటి జరుగుతుంటే నాగ్ ‘వైల్డ్ డాగ్’ చూడటం.. పవన్ కల్యాణ్ పొలిటికల్‌గా ఎదుగుతుంటే ఇలా జగన్‌కు అనుకూలంగా ట్వీట్స్ చేయడం.. తాజాగా బాస్ టైమింగ్స్ మెచ్చుకునేలా లేవు. ఒకప్పుడు బాస్ ఎలా ఉండేవాడు’’ అంటూ రకరకాల ఎమోజీలతో ట్వీట్స్ పెడుతున్నారు.