'జేమ్స్ బాండ్' మూవీ రివ్యూ
Send us your feedback to audioarticles@vaarta.com
జేమ్స్ బాండ్ ఇంగ్లీష్ పుస్తకాల్లో ఉన్న క్యారెక్టర్ కి హాలీవుడ్ దర్శకులు కల్పించిన రూపం. ఎన్నో యాక్షన్ ఎంటర్ టైనర్స్ చిత్రాలతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ లను షేక్ చేసిన క్యారెక్టర్. అలాంటి ఒక పేరుని టైటిల్ పెట్టాలంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. అయితే అల్లరి నరేష్ ఆ సాహసం చేశాడు, జేమ్స్ బాండ్ అనే టైటిల్ పెట్టడమే కాకుండా నేను కాదు నా పెళ్లాం అనే ట్యాగ్ లైన్ ను యాడ్ చేసి సినిమాలో హీరో తన పెళ్లాం చేతిలో ఎలాంటి ఇబ్బందులు పడగుతాడోనని చెప్పకనే చెప్పాడు. మరి ఆ ఇబ్బందులు ఎలాంటివో తెరపైనే చూసి ఎంజాయ్ చేయాలనే విధంగా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా జరిగాయి. మరి లేడీ డాన్ దగ్గర ఒక అమాయక భర్త ఎలా బలయ్యాడనే భర్త బలి కథ తెలుసుకుందాం
కథ
చంద్రం(చంద్రమోహన్) తన ఫ్యామిలీతో హైదరాబాద్ లో ఉంటాడు. అతనికి గొడవలంటే చాలా భయం. అతని కొడుకే లక్ష్మీ ప్రసాద్ అలియాస్ నాని(నరేష్). సాప్ట్ వేర్ ఉద్యోగి. తనకి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, రౌడీలు కబ్జా చేసిన తన ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకోవాలని రెండు కోరికలుంటాయి. అయితే చాలా భయస్థుడు. కట్ చేస్తే దుబాయ్ లో లేడీ డాన్ పూజ అలియాస్ బుల్లెట్(సాక్షిచౌదరి) తన ప్రత్యర్థి(ఆశిష్ విద్యార్థి) కొడుకుని ఒక గొడవలో చంపేస్తుంది. దాంతో ఆశిష్ విద్యార్థి బుల్లెట్ ను చంపేయాలనుకుంటుంటాడు. బుల్లెట్ తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే విడిపోతారు. తండ్రి పెంపకంలో పెరిగినప్పటికీ ఇండియా వెళ్లి అప్పుడప్పుడూ తల్లిని కలుస్తుంటుంది. అయితే తల్లికి మాత్రం తాను ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్నట్లు చెబుతుంది. తన తల్లికి క్యాన్సర్ అని తెలియడంతో ఇండియా వచ్చేస్తుంది. దొంగ పెళ్లి చేసుకుని తల్లిని సంతోష పెట్టాలని అనేక ప్రయత్నాలు చేసినా ఫలించదు. అప్పుడు మ్యారేజ్ బ్రోకర్ (కృష్ణభగవాన్) పూజ బ్యాగ్రౌండ్ ను దాచి పెట్టి నానితో పెళ్లి జరిపిస్తాడు. నానికి, తల్లికి అసలు నిజం తెలియనీయకుండా పూజ మేనేజ్ చేస్తుంటుంది. అయితే ఓ సందర్భంలో నానికి అసలు నిజం తెలిసిపోతుంది. అప్పుడు నాని ఏం చేశాడు? బుల్లెట్ భర్తను ఎలా ఇబ్బంది పెడుతుంది? చివరికి ఆమెలోఏమైనా మార్పు కలుగుతుందా? అనే విసయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...
సమీక్ష
నానిగా అల్లరి నరేష్ ఎప్పటిలాగానే ఎనర్జిటిక్ గా నటించాడు. తనదైన స్టయిల్ లో కామెడి పండించాడు. స్పూఫ్ కామెడి తరహాలో కాకుండా కొత్తగా కామెడి చేయాలనే తన ప్రయత్నం మెచ్చుకోదగిందే. లేడీ డాన్ గా నటించిన సాక్షి చౌదరి నటనకు మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అయితే గ్లామరే కాదు ఫెర్ ఫార్మెన్స్ కూడా జోడించి ఉంటే బావుండేది. చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు తదితరులు తమ పాత్రల పరిధి మేర చక్కగానే నటించారు.
సాయికిషోర్ మచ్చ కథను బాగానే రాసుకున్నాడు కానీ కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కామెడి స్ర్కిప్ట్ అనగానే నరేష్ ఇప్పటికీ డిఫరెంట్ ఫార్మేట్ లో కామెడి చేశాడు. అదే టైప్ కామెడినే చేయించడానికి ట్రై చేశాడే తప్ప కొత్తగా చేసిందేమీ లేదు. అయితే విరగబడి నవ్వేంత కామెడి సన్నివేశం ఒకటి కూడా లేకపోవడం శోచనీయం. సాయికార్తీక్ సంగీతం కూడా పరావాలేదు. రెండు, మూడు పాటలు బావున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరావాలేదు. దామునర్రావు సినిమాటోగ్రఫీ బావుంది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ ఆకట్టుకోలేదు. కొన్ని సన్నివేశాలను తొలిగించి ఉంటే సినిమాలో వేగం పెరిగేది. నిర్మాణ విలువలు బావున్నాయి.
విశ్లేషణ
నరేష్ స్పూఫ్ లేని కామెడి చేయాలనుకోవడం మంచి పరిణామమే. అయితే ఈ మధ్య ఒకే స్టయిల్ ఆఫ్ కామెడిని చేస్తున్నాడేమో అనిపిస్తుంది. గమ్యం తరహా చిత్రాలను ట్రై చేస్తే ఆడియెన్స్ ను ఆకట్టుకోవచ్చు. అంటే ఇక్కడ నరేష్ ను తప్పు పట్టలేం. తనని కొత్తగా ప్రెజెంట్ చేసే దర్శకులు కరువయ్యారా అనిపిస్తుంది. సాక్షి చౌదరి పెర్ ఫార్మెన్స్ విషయంలో డీలా పడింది. టైటిల్ ప్రకారం చూస్తే ఇందులో పిరికివాడైన భర్త తన లేడీ డాన్ భార్యను అనుకూలవతిగా ఎలా మలుచుకుంటాడో అనేది మెయిన్ పాయింట్ అయినా చివరకి తనే ఓ డాన్ లా మారిపోవడం ఎంత వరకు కరెక్టో దర్శకుడికే తెలియాలి. సినిమాలో కొన్ని అనవసరమైన సీన్స్ తో కామెడి పుట్టించాలనుకునే ప్రయత్నం పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. సాయికార్తీక్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చే ప్రయత్నం చేశాడు. జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, వేణు, సప్తగిరి, పృథ్వీ పేరడీ కామెడి కొద్ది మేర నవ్వించాయి.
బాటమ్ లైన్
జేమ్స్ బాండ్: అల్లరి నరేష్ స్టయిల్ ఆఫ్ కామెడి మూవీ
రేటింగ్: 3/5
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com