'ఆర్ఆర్ఆర్`లో జలియన్ వాలాభాగ్
Send us your feedback to audioarticles@vaarta.com
జలియన్ వాలాభాగ్ ఘటన అనగానే ఎవరికైనా స్వాతంత్ర్యానికి ముందు జనరల్ డయ్యర్ ప్రజలపై అకృత్యంగా చేసిన కాల్పుల ఘటనే గుర్తుకు వస్తుంది. 1919లో జరిగిన ఈ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు విడిచారు. భారతదేశ చరిత్ర పుటల్లో ఈ ఘటన మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని మరోసారి మన కళ్లకు కట్టినట్లుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆవిష్కరించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకెళ్తే.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామా `ఆర్ఆర్ఆర్`రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
దేశ స్వాతంత్ర్యంలో భాగమైన కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలకు సంబంధించిన కల్పితగాథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో జలియన్‌వాలాభాగ్ ఘటనను భారీగా, తనదైన స్టైల్లో జక్కన్న తెరరపై ఆవిష్కరించబోతున్నాడట. ఇప్పటి వరకు ఈ సన్నివేశాన్ని మన మేకర్స్ వెండితెరపై చూపించారు. కానీ.. జక్కన్న ఎలా చూపిస్తాడనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన రామరాజు ఫర్ భీమ్, భీమ్ ఫర్ రామరాజు టీజర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఎన్టీఆర్, చరణ్‌లతో పాటు సముద్రఖని.. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్‌లతో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్ సన్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments