రామెజిఫిల్మ్ సిటి లో చివరి పాట చిత్రీకరణ జులై 22న సునీల్ 'జక్కన్న' విడుదల

  • IndiaGlitz, [Friday,July 08 2016]

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న రామెజిఫిల్మ్ సిటిలో చివ‌రి పాట చిత్రీక‌ర‌ణ‌లో వుంది. మ‌రో రెండు రోజుల్లో షూటింగ్ పార్ట్ అంతా పూర్త‌వుతుంది. ఇప్ప‌టికే పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి ఆడియోని మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల‌మీదుగా విడుద‌ల చేశారు. ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ ని చూస్తే సునీల్ బ్యాక్ టు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటూ అన‌క త‌ప్ప‌టంలేదు. ఇదే మేట‌ర్ని సోష‌ల్ మీడియాలో వివ‌రీతంగా ట్రెండింగ్ చేశారు. పంచ్ డైలాగ్స్ ఈచిత్రంలో చాలా వున్నాయి. ర‌క్ష చిత్రం ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. దినేష్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈచిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జులై 22 విడుద‌ల‌కి స‌న్నాహ‌లు చేస్తున్నారు.
నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...... సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మా జ‌క్క‌న్న చిత్రం. సునీల్ గారి కామెడి టైమింగ్ కి డైర‌క్ట‌ర్ వంశి రాసిన సీన్ కి ధియోట‌ర్స్ లో క్లాప్స్ ప‌డ‌తాయి. దీనికి ఉదాహ‌ర‌ణ రీసెంట్ గా రిలీజ‌య్యిన ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్. అదే విధంగా దినేష్ గారు అందిచిన ఆడియో కూడా ఫుల్ ఎన‌ర్జిగా వుంటాయి. అన్ని పాట‌లు పాడుకునేలా వుంటాయి. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. మా డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ కొత్త‌ పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. ఎట్టిప‌రిస్ధితిలో మా చిత్రాన్ని జులై 22న‌ విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తాము, అని అన్నారు.

More News

జనతా గ్యారేజ్ ఆడియో వేడుక - వేదిక ఖరారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్.

చిరు సినిమాలో బన్ని భామ....

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తమిళ చిత్రం కత్తి రీమేక్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ప్ర‌భాస్ న్యూమూవీ టైటిల్ ఇదా..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో మిర్చి చిత్రాన్ని నిర్మించిన యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ప్ర‌భాస్ తో రెండు చిత్రాల‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో ఒక చిత్రానికి ర‌న్ రాజా ర‌న్ డైరెక్ట‌ర్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో..

హైద‌రాబాద్ ఫిల్మ్ ఛాంబ‌ర్ వ‌ద్ద నిరాహార దీక్ష చేస్తున్న హీరో ఎవ‌రునుకుంటున్నారా..?  లాహిరి లాహిరి లాహిరిలో..., ధ‌న‌ల‌క్ష్మి ఐ ల‌వ్ యు త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన ఆదిత్యా ఓం.

నిఖిల్ మూవీతో క‌న్న‌డ‌లో ఎంట్రీ ఇస్తున్న ఆది..

డైలాగ్ కింగ్ సాయికుమార్ త‌న‌యుడు ఆది ప్రేమ‌కావాలి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే యూత్ లో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్నారు.