జక్కన్న వచ్చేస్తున్నాడు...

  • IndiaGlitz, [Saturday,July 02 2016]

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ న‌టించిన‌ తాజా చిత్రం జ‌క్క‌న్న‌. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెర‌కెక్కించారు. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్.పి. ఏ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ స‌ర‌స‌న మ‌న్నార చోప్రా హీరోయిన్ గా న‌టించింది. ఇటీవ‌ల మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజైన జ‌క్క‌న్న ఆడియోకు మంచి స్పంద‌న ల‌భిస్తుంది. ఇక ఈ సినిమాలో మిగిలిన ఒక్క పాట‌ను ఈ నెల 4 నుంచి చిత్రీక‌రించ‌నున్నారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. ఈ ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్ ని ఈ నెల‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..జ‌క్క‌న్న పై సునీల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. సునీల్ ఆశించిన విజ‌యాన్ని జ‌క్క‌న్న అందిస్తాడ‌ని ఆశిద్దాం.