ఎందరికో ఆదర్శంగా నిలిచిన సునీల్ మనకున్న బెస్ట్ డ్యాన్స్ ర్స్ లో ఒకడు - మెగాస్టార్ చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
కమెడియన్ టర్నడ్ కథానాయకుడు సునీల్ నటించిన తాజా చిత్రం జక్కన్న. ఈ చితాన్ని రక్ష ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రమ్ నిర్మాత సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని ఆర్.పి. ఏ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సునీల్ సరసన మన్నార చోప్రా హీరోయిన్ గా నటించింది. దినేష్ సంగీతం అందించిన జక్కన్న ఆడియో రిలీజ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై బిగ్ సిడీ, ఆడియో సి.డీను రిలీజ్ చేసి తొలి సిడీను హీరో సునీల్ కు అందించారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ...సునీల్ మూడు రోజుల క్రితం ఫోన్ చేసి..జక్కన్న ఆడియో ఫంక్షన్ కి రమ్మని పిలిచాడు. అయితే...షూటింగ్ లో బిజీగా ఉండడం వలన వెళ్లకూడదు అనుకున్నాను. కానీ..నాపై సునీల్ చూపించే అభిమానం గుర్తొచ్చి నో చెప్పలేకపోయాను. షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకుని ఇక్కడకి వచ్చాను. నా డ్యాన్స్ లు చూసి ఈస్ధాయికి వచ్చాను అన్నయ్యని సునీల్ చెబుతుంటాడు. నా అభిమాని సునీల్ అభివృద్దిలోకి వచ్చాడంటే తల్లిదండ్రులు తర్వాత సంతోషించేది నేనే. సునీల్ ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. మనకున్న బెస్ట్ డ్యాన్స్ ర్స్ లో సునీల్ ఒకడు. కామెడీలో హీరోయిజం చూపించి సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ వంశీ ఆకెళ్ల ఈ చిత్రాన్ని చక్కగా రూపొందించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. జక్కన్న ట్రైలర్ లో ఫ్యామిలీ, రొమాన్స్, యాక్షన్, కామెడీ...ఇలా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి. సో...ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ అలరిస్తుంది. దినేష్ మంచి మ్యూజిక్ డైరెక్టర్. తను లేడని కొన్ని సినిమాలు రీ రికార్డింగ్ ఆపేసిన రోజులు ఉన్నాయి. హీరోయిన్ మన్నారా మంచి స్ధాయికి ఎదగాలి. సునీల్ కి ఈ సినిమాతో బ్లాక్ బష్టర్ రావాలి. జక్కన్న ఖచ్చితంగా విజయం సాధిస్తాడు అన్నారు.
హీరో సునీల్ మాట్లాడుతూ...చిరంజీవి గారు లేకపోతే నా లైఫ్ సెటిల్ అయ్యేది కాదు. ఆయన బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా నాకోసం ఇక్కడికి వచ్చారు. ఆయన మనసు కూడా మెగాస్టార్ రేంజ్ లో ఉంటుంది. ఈ సినిమా మొత్తం కామెడీగా ఉంటుంది. కామెడీతో పాటు పంచ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. రామ్ ప్రసాద్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. నేను విపరీతంగా కామెడీ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ప్రారంభం కావడానికి కారణం మా నిర్మాత సుదర్శన్ గారు. ఎక్కడా రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మన్నారా ఈ మూవీ కోసం చాలా కష్టపడింది. రాజా రవీంద్ర గారి గైడెన్స్ తో ఒకే టైమ్ లో రెండు చిత్రాల్లో నటించాను. వచ్చే నెల 25కి నేను నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక నుంచి సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసి నలభై సినిమాలు చేస్తే ఎంతగా నవ్విస్తానో అంతగా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తాను అన్నారు.
డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్ల మాట్లాడుతూ...ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే...మా జక్కన్న సహాయం చేసిన వాళ్లని మరచిపోకుండా...వారి పై లవ్ చూపిస్తూ...వారి లైఫ్ ని తన చేతుల్లోకి తీసేసుకుంటాడు. వారికి ఇష్టం లేకపోయినా సరే ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరి థ్యాంక్స్ అన్నారు.
నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ....మారుతి సునీల్ తో సినిమా చేద్దాం అన్నారు.ఈ కథ నాకు బాగా నచ్చి ఆయనతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఎంతగానో ప్రొత్సహించారు. ఈ సినిమా పూర్తవ్వడానికి కారణం సునీల్ గారే. దినేష్ మంచి మ్యూజిక్ అందించాడు. వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రాన్ని చాలా బాగా చెక్కాడు. అవుట్ పుట్ బాగా వచ్చింది అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ దినేష్ మాట్లాడుతూ...ఈ ఆల్బమ్ కోసం నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. నన్ను ప్రొత్సహించిన తల్లిదండ్రలుకు, అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. జక్కన్న పాటలు అందరికీ నచ్చుతాయి అని ఆశిస్తున్నాను అన్నారు.
హీరోయిన్ మన్నారా చోప్రా మాట్లాడుతూ...డైలాగ్స్ చెప్పే విషయంలో రామ్ ప్రసాద్ గారు ఎంతగానో హెల్ప్ చేసారు. ఆడియోన్స్ కోరుకునే ఎంటర్ టైన్మెంట్ ఈ చిత్రంలో చాలా ఉంది. అందరికి జక్కన్న చిత్రం నచ్చుతుంది అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ...సునీల్ అన్న ఏ సినిమాలోనైనా నటించాడంటే ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తాడు అనే నమ్మకం ఉంది. తెలుగు ఇండస్ట్రీ మంచి కమెడియన్ ని మిస్ అవుతున్నా..మంచి హీరోని దక్కించుకుంది. సునీల్ అన్న ఎంతో హార్డ్ వర్క్ చేస్తాడు. జక్కన్న టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
రాజా రవీంద్ర మాట్లాడుతూ...ఈ చిత్రంలో సునీల్ పూర్తి స్ధాయి కామెడీ పాత్రలో కనిపిస్తాడు. నాకు ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్ర ఇచ్చిన దర్శకుడు వంశీకృష్ణకు థ్యాంక్స్. జక్కన్న మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ...ప్రేమకథా చిత్రమ్ తరువాత నా లైఫ్ మారిపోయింది. ఇప్పటి వరకు ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ చిత్రంలో కనిపిస్తాను. మంచి పాత్రలో కనిపించే అవకాశం కల్పించిన ఈ చిత్ర దర్శకనిర్మాతలకు రుణపడి ఉంటాను అన్నారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎన్.శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, రామ్ ప్రసాద్, ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com