దంగల్ నటికి చేదు అనుభవం
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ పరిశ్రమకు చెందిన నటీమణులందరూ ఈ మధ్య తమకు పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలపై పెదవి విప్పుతున్నారు. ఇదొక హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఓ ఘటన ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపుతుంది. దంగల్ చిత్రంలో నటించిన జైరా వసీమ్ బాధితురాలు కావడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఎయిర్ విస్తా విమానంలో ఢిల్లీ నుండి ముంబై వెళుతున్న జైరాతో తోటి ప్రయాణీకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడట. ఈ విషయాన్ని జైరా ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. తన వెనుక ప్రయాణీకుడు కాలు పెట్టిన దాన్ని జైరా వీడియో తీసింది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
వెలుతురు సరిగ్గా లేకపోవడంతో దుండగుడు ఈ చర్యకు పాల్పడ్డారని, ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదని, అమ్మాయిలకు ఎలాంటి భద్రత ఉందో తెలుస్తుందని కన్నీరు పెట్టుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com