ఈ వారంలోనే జై సింహా టీజ‌ర్‌

  • IndiaGlitz, [Sunday,December 17 2017]

న‌ట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం జై సింహా. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార, హ‌రి ప్రియ‌, న‌టాషా దోషి క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఫేమ్ చిరంత‌న్ భ‌ట్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఈ నెల 24న గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది.

ఇదిలా ఉంటే.. ఈ వారంలోనే జై సింహాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌ని విడుద‌ల చేయ‌బోతున్నార‌ని టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తాజాగా దుబాయ్‌లో పాట‌ల చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి చేసుకుంది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో.. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కి కూడా చోటుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంవ‌త్స‌రం సంక్రాంతికి అదే తేదిన‌ వ‌చ్చిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి మంచి విజ‌యం సాధించింది. జై సింహా కూడా అది రిపీట్ చేస్తుంద‌ని అభిమానులు భావిస్తున్నారు.