'జై సింహా' సెన్సార్ డేట్ ఫిక్సయ్యిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం జై సింహా. సింహా, శ్రీరామరాజ్యం చిత్రాల్లో బాలయ్యకి జోడీగా నటించిన నయనతార ఈ చిత్రంలోనూ కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సి.కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతమందిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. కాగా, ఆడియోని ఈ నెల 24న హాలీల్యాండ్‌లో విడుదల చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సినిమా సెన్సార్ కార్యక్రమాలు డిసెంబర్ 28న జరుగుతాయని తెలిసింది.
యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటాషా దోషి, హరి ప్రియ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బాలకృష్ణకి అచ్చొచ్చిన సీజన్ అయిన సంక్రాంతి సమయంలో జై సింహా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న రానున్న ఈ చిత్రంతో బాలయ్య, నయన్ హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com