'జై సింహా' ఆడియో డేట్ ఫిక్సయ్యింది
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం జై సింహా. ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతార, నటాషా దోషి, హరిప్రియ కథానాయికలు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుకి మంచి స్పందన వచ్చింది.
గౌతమిపుత్ర శాతకర్ణికి సంగీతమందించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు. కాగా, ఈ సినిమా ఆడియోని వచ్చే నెల 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిని కూడా ఈ ఏడాది ఇదే తేదికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. సింహా, శ్రీరామరాజ్యం తరువాత బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా వారిద్దరికి హ్యాట్రిక్ మూవీ అవుతుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. బాలకృష్ణ పవర్ ఫుల్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార పెర్ ఫార్మెన్స్‌కి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుందని తెలిసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com