చిలుకలూరిపేట న్యూ మార్కెట్ యార్డ్ లో 'జై సింహా' 100 రోజుల వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
సంక్రాంతి బరిలో నిలబడి ఘన విజయం సొంతం చేసుకోవడమే కాక అన్నీ వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకొన్న చిత్రం "జై సింహా". నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం జనవరి 12న విడుదలై సరికొత్త రికార్డులను సృష్టించింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించారు.
బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నటాషా దొషీ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 21కి వందరోజులు పూర్తి చేసుకొంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 22వ తారీఖున గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట న్యూ మార్కెట్ యార్డ్ లో సాయంత్రం 5.00 గంటలకు ఈ నిర్వహించనున్నారు చిత్రబృందం.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "బాలయ్యబాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన "జై సింహా" ఏప్రిల్ 21వ తారీఖుకి వంద రోజులు పూర్తి చేసుకోనుండడం చాలా ఆనందంగా ఉంది. ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించిన బాలయ్య, డ్యాన్సులతో విశేషంగా ఆకట్టుకొన్నారు. ముఖ్యంగా ఆయన ఈ సినిమాలో బ్రాహ్మణులను ఉద్దేశించి బాలయ్య చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా సంస్థలో బాలయ్యతో సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాక కె.ఎస్.రవికుమార్ చెప్పిన కథ బాగా నచ్చింది. చిరంతన్ భట్ సంగీతం సినిమాకి హైలైట్ గా నిలిచింది.
నందమూరి అభిమానులు మాత్రమే కాక ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడినీ "జై సింహా" విశేషంగా ఆకట్టుకొంది. అలాంటి సినిమా 100 రోజులు పూర్తి చేసుకోనుండడం చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవడం కోసమే గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేటలో న్యూ మార్కెట్ యాడ్ లో సాయంత్రం 5.00 గంటలకు 100 రోజుల వేడుక నిర్వహించనున్నాం. చిత్రబృందం అందరూ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు" అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments